News October 30, 2024
భారత్‌లో బ్రిటన్ రాజ దంపతుల సీక్రెట్ ట్రిప్.. ఎందుకంటే!
కింగ్ ఛార్లెస్ III, కామిల్లా దంపతులు భారత్‌లో రహస్యంగా పర్యటిస్తున్నారని తెలిసింది. OCT 27 నుంచి వీరు బెంగళూరులోని SICHలో వెల్‌నెస్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని సమాచారం. యోగా, థెరపీ, మెడిటేషన్ థెరపీ తీసుకుంటున్నారని IE తెలిపింది. గతంలోనూ వీరిక్కడికి రావడం గమనార్హం. ఓ సీక్రెట్ ట్రిప్ కోసం వీరిద్దరూ OCT 21-26 మధ్య సమోవాకు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరు HAL ఎయిర్‌పోర్టులో దిగారని తెలిసింది.
Similar News
News October 30, 2024
గ్రూప్-2 పరీక్షలపై కీలక ప్రకటన
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై APPSC కీలక ప్రకటన చేసింది. జనవరి 5న ఉదయం, సాయంత్రం ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 13 ఉమ్మడి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయని, దాదాపు లక్ష మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొంది. వచ్చే ఏడాది జరిగే DSC, టెన్త్, ఇంటర్ పరీక్షల దృష్ట్యా జనవరి 5న పరీక్ష నిర్వహిస్తున్నట్లు APPSC ప్రకటనలో వివరించింది.
News October 30, 2024
ఆయుష్మాన్ భారత్ పెద్ద స్కాం: ఆప్
ఆయుష్మాన్ భారత్‌లో ఢిల్లీ చేరకపోవడాన్ని PM మోదీ తప్పుబట్టడంపై ఆప్ స్పందించింది. BJP పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం పెద్ద స్కాం అని MP సంజయ్ సింగ్ విమర్శించారు. ఇందులోని నిబంధనల వల్ల ఒక్క ఢిల్లీ వ్యక్తికి కూడా పథకం వర్తించదన్నారు. ఫ్రిడ్జ్, స్కూటర్ ఉన్నా, ₹10 వేలకు పైగా ఆదాయం ఉంటే పథకం లబ్ధిపొందలేరని పేర్కొన్నారు. దర్యాప్తు జరిపితే పథకంలోని నిర్వహణ లోపం బయటపడుతుందన్నారు.
News October 30, 2024
ALERT.. కాసేపట్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గిరి, ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.