News October 30, 2024
భారత్‌లో బ్రిటన్ రాజ దంపతుల సీక్రెట్ ట్రిప్.. ఎందుకంటే!
కింగ్ ఛార్లెస్ III, కామిల్లా దంపతులు భారత్‌లో రహస్యంగా పర్యటిస్తున్నారని తెలిసింది. OCT 27 నుంచి వీరు బెంగళూరులోని SICHలో వెల్‌నెస్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని సమాచారం. యోగా, థెరపీ, మెడిటేషన్ థెరపీ తీసుకుంటున్నారని IE తెలిపింది. గతంలోనూ వీరిక్కడికి రావడం గమనార్హం. ఓ సీక్రెట్ ట్రిప్ కోసం వీరిద్దరూ OCT 21-26 మధ్య సమోవాకు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరు HAL ఎయిర్‌పోర్టులో దిగారని తెలిసింది.
Similar News
News November 12, 2024
GOOD NEWS: ఫ్రీ కోచింగ్, నెలకు రూ.2,500
AP: బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5,200 మందికి కోచింగ్ ఇస్తామని, BCలకు 66%, SCలకు 20%, STలకు 14% చొప్పున సీట్లు కేటాయించామన్నారు. వారితో పాటు EWS అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామని చెప్పారు. 2 నెలల పాటు ఇవ్వనున్న ఈ కోచింగ్ టైంలో నెలకు రూ.1500 స్టైఫండ్, మెటీరియల్ కోసం రూ.1000 ఇస్తామని తెలిపారు.
News November 12, 2024
రైతులేమైనా తీవ్రవాదులా?: కేటీఆర్
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల వివాదంలో పలువురిని పోలీసులు <<14588376>>అరెస్టు చేయడాన్ని<<>> కేటీఆర్ ఖండించారు. ‘అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా? వాళ్లేమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా? ఇదేనా వెలుగులను తరిమేసి చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం?’ అని Xలో ఫైరయ్యారు.
News November 12, 2024
ఏపీలో రిలయన్స్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు: ET
ఏపీకి భారీ పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ పేర్కొంది. 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని తెలిపింది. ఇటీవల నారా లోకేశ్ ముంబై పర్యటనలో అనంత్ అంబానీతో ఈ డీల్ ఫైనల్ అయిందని పేర్కొంది. దీనివల్ల రాబోయే ఐదేళ్లలో 2.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు వివరించింది.