News October 30, 2024
విద్యార్థులకు శుభవార్త
TG: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డైట్ ఛార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను పెంచినట్లు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థ వసతి గృహాలకు దీన్ని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. 3 నుంచి 7వ తరగతి వారికి రూ.950గా ఉన్న ఛార్జీని రూ.1330కి, 8 నుంచి 10వ క్లాస్ వారికి రూ.1100 నుంచి ₹1540కి పెంచింది. ఇంటర్ నుంచి పీజీ వారికి ₹1500 నుంచి రూ.2100కి పెంచింది.
Similar News
News November 18, 2024
నేను పారిపోలేదు: నటి కస్తూరి
తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరిని హైదరాబాద్‌లోని సినీ నిర్మాత హరికృష్ణన్ బంగ్లాలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తనకు ఎలాంటి భయం లేదని, ఎక్కడికీ పారిపోలేదన్నారు. షూటింగ్ కోసమే HYD వచ్చానని, తన ఫోన్ న్యాయవాదికి ఇచ్చినట్లు చెప్పారు. కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని కస్తూరి తెలిపారు.
News November 18, 2024
మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు!
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 23న అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ తుఫానుగా మారే ఛాన్సుందని, ఈనెల 26 లేదా 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా వస్తుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాయలసీమలోని అన్ని జిల్లాలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
News November 18, 2024
ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా
AP: ఇవాళ జరగాల్సిన రాష్ట్ర క్యాబినెట్ భేటీ ఎల్లుండికి వాయిదా పడింది. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిన్న నారావారిపల్లెలో జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం వరకూ సీఎం అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.