News October 30, 2024
విద్యార్థులకు శుభవార్త
TG: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డైట్ ఛార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను పెంచినట్లు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థ వసతి గృహాలకు దీన్ని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. 3 నుంచి 7వ తరగతి వారికి రూ.950గా ఉన్న ఛార్జీని రూ.1330కి, 8 నుంచి 10వ క్లాస్ వారికి రూ.1100 నుంచి ₹1540కి పెంచింది. ఇంటర్ నుంచి పీజీ వారికి ₹1500 నుంచి రూ.2100కి పెంచింది.
Similar News
News November 13, 2024
రానా సరికొత్త షో!
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్పెషల్ షోలు చేస్తూ హీరో రానా బిజీగా గడుపుతున్నారు. తాజాగా ‘ది రానా దగ్గుబాటి షో’ అనే పేరుతో సరికొత్త ప్రోగ్రామ్‌తో ముందుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల 23వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నటీనటులకు సంబంధించి మనకు తెలియని స్టోరీలను ఇందులో తెలియజేస్తారని రానా ట్వీట్ చేశారు. గతంలో ఆయన చేసిన ‘మెక్‌డోవెల్ నంబర్ 1 యారీ’ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
News November 13, 2024
గుజరాత్ బ్యాటింగ్ కోచ్‌గా పార్థివ్ పటేల్
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జీటీ యాజమాన్యం ధ్రువీకరించింది. కాగా పార్థివ్ ప్రస్తుతం కామెంటేటర్, అనలిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఇకపై మైదానంలో దిగనున్నారు. కాగా పార్థివ్ భారత్ తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే 139 ఐపీఎల్ మ్యాచులు ఆడారు.
News November 13, 2024
కలకలం.. టిక్‌టాక్ స్టార్ ప్రైవేట్ వీడియోలు లీక్
పాకిస్థాన్‌లో వరుసగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రైవేట్ వీడియోలు లీక్ అవ్వడం సంచలనం రేపుతోంది. తాజాగా టిక్‌టాక్ స్టార్ ఇంషా రెహ్మాన్‌కు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు వాట్సాప్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ఆమె తన SM అకౌంట్లను డీయాక్టివేట్ చేసినట్లు సమాచారం. గతనెల మరో టిక్‌టాక్ స్టార్ మినాహిల్ మాలిక్ తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియోలూ బయటికి రావడం కలకలం రేపింది.