News October 31, 2024
‘భారత్-చైనా’ విమాన సర్వీసులు.. డ్రాగన్ రాయబారి ఏమన్నారంటే?
తూర్పు లద్దాక్‌లో బలగాల ఉపసంహరణ కొలిక్కి రావడంపై భారత్‌లోని చైనా రాయబారి షు ఫీహాంగ్ స్పందించారు. ఈ పరిణామం ఇరుదేశాల సంబంధాలను సులభతరం, బలోపేతం చేస్తుందని చెప్పారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ-జిన్‌పింగ్‌లు ముఖ్యమైన అంశాలపై అవగాహనకు వచ్చారని తెలిపారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం తాను ఎదురుచూస్తున్నానన్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.
Similar News
News October 31, 2024
మెడికల్ PG కోర్సులకు నేటి నుంచి దరఖాస్తులు
TG: 2024-25 సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎండీ, ఎంఎస్, డిప్లొమా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక దశలవారీగా కౌన్సెలింగ్ ఉంటుంది. అల్లోపతి, ఆయుర్వేద, హోమియో కోర్సులకు అడ్మిషన్లు పొందవచ్చు. జాతీయ కోటా పోగా మిగతా సీట్లన్నీ తెలంగాణ వాసులకే దక్కుతాయి.
News October 31, 2024
ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు సిద్ధమే.. కానీ: ఖాసిమ్
నస్రల్లా స్థానంలో హెజ్బొల్లా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నయీమ్ ఖాసిమ్ తొలిసారి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. ఆ దేశం దురాక్రమణను ఆపి తమకు అనుకూలమైన షరతులకు ఒప్పుకుంటే కాల్పుల విరమణకు సిద్ధమేనని తెలిపారు. అందుకోసం తామేమీ అడుక్కోబోమని స్పష్టం చేశారు. నస్రల్లా అనుసరించిన వార్ ప్లాన్‌కు కట్టుబడి ఉంటామన్నారు. కాగా ఈ కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండరని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
News October 31, 2024
విక్రయాల్లో ‘వివో’.. విలువలో ‘శాంసంగ్’ టాప్
భారత్‌లో స్మార్ట్ ఫోన్ విక్రయాల పరంగా 19.4% వాటాతో వివో అగ్రస్థానంలో నిలిచినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ మూడో క్వార్టర్ గణాంకాలను అది వెలువరించింది. ఆ తర్వాత షావోమి(16.7%), శాంసంగ్(15.8%), ఒప్పో(13.4%), రియల్మీ(11.3%) ఉన్నాయంది. ఇక విక్రయాల్లో విలువపరంగా 22.8% వాటాతో శాంసంగ్ టాప్‌లో ఉన్నట్లు తెలిపింది. రెండో స్థానంలో యాపిల్(21.8%) ఉన్నట్లు పేర్కొంది.