News October 31, 2024

‘భారత్-చైనా’ విమాన సర్వీసులు.. డ్రాగన్ రాయబారి ఏమన్నారంటే?

image

తూర్పు లద్దాక్‌లో బలగాల ఉపసంహరణ కొలిక్కి రావడంపై భారత్‌లోని చైనా రాయబారి షు ఫీహాంగ్ స్పందించారు. ఈ పరిణామం ఇరుదేశాల సంబంధాలను సులభతరం, బలోపేతం చేస్తుందని చెప్పారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ-జిన్‌పింగ్‌లు ముఖ్యమైన అంశాలపై అవగాహనకు వచ్చారని తెలిపారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం తాను ఎదురుచూస్తున్నానన్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.

Similar News

News November 2, 2024

విశాఖ TO అమరావతి 2 గంటల్లో వెళ్లేలా..: CM

image

AP: విశాఖ నుంచి అమరావతికి 2 గంటల్లో వెళ్లేలా రోడ్లను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నేషనల్ హైవేలపై ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు నాంది పలుకుతున్నామని, సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాలు పెంచాలని పేర్కొన్నారు. నక్కపల్లి వద్ద రూ.70వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని తెలిపారు.

News November 2, 2024

భారత్ ఆలౌట్.. 28 పరుగుల ఆధిక్యం

image

NZతో జరుగుతోన్న చివరి టెస్టులో భారత్ స్వల్ప ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్సులో కివీస్ 235 రన్స్ చేయగా టీమ్ ఇండియా 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేనకు 28 పరుగుల ఆధిక్యం లభించింది. గిల్ 90, పంత్ 60 రన్స్ చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 38 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్లతో సత్తా చాటారు.

News November 2, 2024

రేషన్‌లో బియ్యం, పంచదార, కందిపప్పు, జొన్నలు

image

AP: రాష్ట్రంలో రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి రేషన్‌లో జొన్నలను కూడా ప్రభుత్వం చేర్చింది. బియ్యం వద్దనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. గరిష్ఠంగా 3KGల వరకు ఇస్తారు. ఇటు పంచదార, కందిపప్పుని సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ నెల నుంచి 100% రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా చర్యలు తీసుకున్నారు. రూ.67కి కందిపప్పు, అరకేజీ పంచదార రూ.17కు ఇస్తున్నారు.