News October 31, 2024

మూడ్ బాగోలేదా?.. వీటిని తినండి

image

కొంత మందికి మూడ్ ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుంది. శరీరంలో ఎండార్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్ తగ్గడం వల్లే ఇలా జరుగుతుంది. కొన్ని ఆహార పదార్థాలు తింటే మూడ్ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ తింటే వెంటనే మనసు ఉత్తేజపడుతుంది. బెర్రీస్, నట్స్, గింజలు, అవకాడో తింటే వెంటనే మనసు ఆనంద పడుతుంది. సాల్మన్ ఫిష్, బచ్చలికూర, పుట్టగొడుగులు తింటే మానసిక స్థితి మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News February 9, 2026

‘నో ఫోన్ ఛాలెంజ్’.. మీ పిల్లలకూ విసరండి!

image

విద్యార్థులు ఫోన్లకు బానిసలవకుండా కేరళలోని కూతుపరంబ స్కూల్ టీచర్ అమృత ‘నో ఫోన్ ఛాలెంజ్’ ప్రారంభించారు. ఫోన్ ముట్టుకోని పిల్లలకు స్టిక్కర్లు, ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది పిల్లల్లో సానుకూల పోటీని పెంచింది. మీరూ ఇంట్లో పిల్లలు ఫోన్ చూడకుండా ఉండేందుకు ఈ ఛాలెంజ్‌ను ట్రై చేయండి. రోజంతా ఫోన్ చూడకుంటే బహుమతి ఇస్తామని చెప్పండి. ఆ సమయాన్ని క్రియేటివ్ వర్క్స్‌పై ఉపయోగించేలా చూడండి.

News February 9, 2026

డిజిటల్ మోసాలపై కఠిన చర్యలకు SC ఆదేశాలు

image

డిజిటల్ ఆర్థిక మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పేర్కొంది. డిజిటల్ మోసాల ద్వారా రూ.54 వేల కోట్లకు పైగా కొల్లగొట్టడాన్ని దోపిడీగా అభిప్రాయపడింది. డిజిటల్ అరెస్ట్ కేసులపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా మోసాల నివారణకు RBI రూపొందించిన ఎస్‌ఓపీని (Standard Operating Procedure) అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

News February 9, 2026

కసిరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

image

AP: సుప్రీంకోర్టులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు SC ధర్మాసనం నిరాకరించింది. రూ.750 కోట్ల కుంభకోణంలో 9నెలలుగా జైలులో ఉండటం పెద్ద సమయమేమీ కాదని CJI జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ స్కామ్‌లో ఎన్ని రూ.కోట్లు సంపాదించారని ప్రశ్నించారు. వాదనలు వినిపించేందుకు కసిరెడ్డి తరఫు న్యాయవాది సమయం కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు.