News October 31, 2024
మూడ్ బాగోలేదా?.. వీటిని తినండి
కొంత మందికి మూడ్ ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుంది. శరీరంలో ఎండార్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్ తగ్గడం వల్లే ఇలా జరుగుతుంది. కొన్ని ఆహార పదార్థాలు తింటే మూడ్ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ తింటే వెంటనే మనసు ఉత్తేజపడుతుంది. బెర్రీస్, నట్స్, గింజలు, అవకాడో తింటే వెంటనే మనసు ఆనంద పడుతుంది. సాల్మన్ ఫిష్, బచ్చలికూర, పుట్టగొడుగులు తింటే మానసిక స్థితి మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News November 4, 2024
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్
భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్ తనకు చివరిదని తెలిపారు. వచ్చే IPL వేలానికి కూడా ఆయన రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో ఈ 40ఏళ్ల వికెట్ కీపర్ IPLకూ గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడిన సాహా, రంజీల్లో బెంగాల్, త్రిపుర జట్లకు, IPLలో KKR, CSK, PBKS, SRH, GTకి ప్రాతినిధ్యం వహించారు.
News November 4, 2024
మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్-1
AP: చెరువుల్లో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచినట్లు కేంద్ర గణాంక శాఖ నివేదికలో వెల్లడైంది. జాతీయ స్థాయిలో ఏపీ వాటా 2011-12లో 17.7 శాతం ఉండగా, 2022-23 నాటికి 40.9 శాతానికి పెరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగాల్(14.4%), ఒడిశా(4.9%), బిహార్(4.5%), అస్సాం(4.1%) ఉన్నాయి. ఇక పశువుల ఉత్పత్తిలో ఏపీ ఫోర్త్, ఉద్యాన ఉత్పత్తుల్లో ఐదో స్థానంలో నిలిచింది.
News November 4, 2024
రేపు ఆవర్తనం.. విస్తారంగా వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడి రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. గత నెలలో 3 అల్పపీడనాల కారణంగా సాధారణం కంటే అధిక వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.