News October 31, 2024
కర్రలతో కొట్టుకొనే స్థితి నుంచి స్వీట్లు తినిపించుకొనే స్థాయికి..
భారత్, చైనా దౌత్యనీతిలో టెక్టానిక్ షిఫ్ట్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక కలవడం కష్టమే అనుకుంటే మిత్రబంధం ఒక్కసారిగా మెరుగైంది. కొవిడ్ టైమ్‌లో గల్వాన్‌లో చైనీయులను భారత జవాన్లు తరిమికొట్టారు. పిడిగుద్దులు, కర్రలు, రాడ్లతో చుక్కలు చూపించారు. ఇప్పుడు డిస్‌ఎంగేజ్‌మెంట్ ఒప్పందం కుదరడంతో స్వీట్లు తినిపించి జైశ్రీరామ్ అనిపించారు. భారత్ ఇదే ధోరణిలో సరిహద్దు సమస్యను పూర్తిగా పరిష్కరించుకోనుందా? మీ కామెంట్.
Similar News
News October 31, 2024
మహారాష్ట్ర ఎన్నికల్లో BRS పోటీపై KTR స్పందన
మహారాష్ట్రలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో BRS పోటీ చేస్తుందా? అన్న ప్రశ్నకు #AskKTRలో KTR వివరించారు. ‘ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం మా సొంత రాష్ట్రం తెలంగాణపైనే ఉంది’ అని బదులిచ్చారు. అటు HYDలో నెలరోజులు 144 సెక్షన్ పెట్టడం షాకింగ్ అంశమని, రాష్ట్రాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ డిజాస్టర్ అని ఆయన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
News October 31, 2024
BPL ఫౌండర్ గోపాలన్ నంబియార్ మృతి
భారత ఎలక్ట్రానిక్ కంపెనీ బీపీఎల్ గ్రూప్ వ్యవస్థాపకులు టీపీ గోపాలన్ నంబియార్ (94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం 10.15 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నంబియార్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతాన్ని బలంగా కాంక్షించిన పారిశ్రామికవేత్త అని కొనియాడారు.
News October 31, 2024
మహారాష్ట్ర తదుపరి సీఎం ఫడ్నవీస్: రాజ్ థాక్రే
దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి మహారాష్ట్ర CM అవుతారని MNS చీఫ్ రాజ్ థాక్రే జోస్యం చెప్పారు. ఎన్నికల తరువాత MNS, BJP కలుస్తాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై శివసేన UBT MP సంజయ్ రౌత్ స్పందిస్తూ కుమారుడు అమిత్ థాక్రే భవిష్యత్తుపై ఆందోళనతోనే రాజ్ BJP జపం చేస్తున్నారని విమర్శించారు. మోదీ, అమిత్ షాలను MHలో అనుమతించకూడదన్న వ్యక్తే ఈ రోజు BJPని పొగుడుతున్నారని దుయ్యబట్టారు.