News October 31, 2024

మహారాష్ట్ర ఎన్నికల్లో BRS పోటీపై KTR స్పందన

image

మహారాష్ట్రలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో BRS పోటీ చేస్తుందా? అన్న ప్రశ్నకు #AskKTRలో KTR వివరించారు. ‘ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం మా సొంత రాష్ట్రం తెలంగాణపైనే ఉంది’ అని బదులిచ్చారు. అటు HYDలో నెలరోజులు 144 సెక్షన్ పెట్టడం షాకింగ్ అంశమని, రాష్ట్రాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ డిజాస్టర్ అని ఆయన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

Similar News

News November 10, 2024

భవన నిర్మాణాల అనుమతికి త్వరలో కొత్త విధానం: మంత్రి

image

AP: రాష్ట్రంలో భవన నిర్మాణాల అనుమతికి త్వరలో కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ లేదా ఇంజినీర్లు ప్లాన్ సమర్పిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. నిర్మాణాలు ప్లాన్ ప్రకారమే ఉండాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. అన్ని అనుమతులు/ఫీజుల చెల్లింపు ఆన్‌లైన్‌లోనే జరుగుతుందన్నారు. DECలోపు కొత్త విధానానికి సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

News November 10, 2024

సౌదీ అరేబియాలో మెట్రో లోకో పైలట్‌గా తెలుగు మహిళ

image

HYD మెట్రో రైలు లోకో పైలట్ ఇందిర(33) అరుదైన ఘనత అందుకోనున్నారు. వచ్చే ఏడాది సౌదీలోని రియాద్‌లో ప్రారంభమయ్యే ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌లో సేవలు అందించనున్నారు. రైళ్లను నడపడం, స్టేషన్ల ఆపరేటింగ్‌లో ఆమె నైపుణ్యాన్ని గుర్తించి మెట్రో ప్రాజెక్టుకు ఎంపిక చేసి ఐదేళ్ల పాటు శిక్షణ అందించారు. ఇప్పటికే ఆమె ట్రయల్ రైళ్లను నడుపుతున్నారు. తెలుగు బిడ్డగా ఈ ప్రాజెక్టులో భాగమవ్వడం గర్వంగా ఉందని ఇందిర చెప్పారు.

News November 10, 2024

సౌతాఫ్రికా టార్గెట్ 125

image

SAతో జరుగుతోన్న రెండో టీ20లో భారత బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్లు శాంసన్ (0), అభిషేక్ శర్మ (4)తో పాటు సూర్య (4), రింకూ సింగ్ (9) ఫెయిల్ అయ్యారు. తిలక్ 20, అక్షర్ 27, హార్దిక్ 39* రన్స్ చేశారు.