News November 1, 2024

కూతురు పేరు వెల్లడించిన దీపికా పదుకొణె

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన కుమార్తె పేరును వెల్లడించారు. ఆమెకు ‘దువా పదుకొణె సింగ్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. దువా అంటే ప్రార్థన అని, మా ప్రార్థనలకు ఆమె సమాధానం’ అని దీపిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా 38 ఏళ్ల దీపిక.. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ సెప్టెంబర్‌లో పాప జన్మించింది.

Similar News

News December 27, 2024

డైరెక్టర్ కన్నుమూత

image

తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి అలియాజ్ SD సభా(61) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన తమిళంలో విజయ్‌కాంత్ హీరోగా భారతన్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ప్రభుదేవాతో వీఐపీ అనే సినిమాను తెరకెక్కించారు. తెలుగులో 2005లో జగపతిబాబు, కళ్యాణి జంటగా పందెం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. సభా తమిళంలో తీసిన సుందర పురుషుడు అనే సినిమా ‘అందాల రాముడు’గా రీమేక్ చేశారు. మొత్తంగా 10 మూవీలకు పనిచేశారు.

News December 27, 2024

నల్ల బ్యాండ్లతో భారత క్రికెటర్లు

image

బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు భారత క్రికెటర్లు చేతికి నల్ల బ్యాండ్లతో కనిపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపంగా వీటిని ధరించారు. రెండో రోజు ఆటలో కమిన్స్(49) వికెట్‌ను జడేజా తీశారు. మరోవైపు సెంచరీ తర్వాత స్మిత్ దూకుడు పెంచారు. AUS స్కోరు 446/7.

News December 27, 2024

చిల్డ్రన్స్ డేకి DEC 26 సరైన రోజు: కిషన్ రెడ్డి

image

TG: బాలల దినోత్సవాన్ని NOV 14న నిర్వహించడం సరి కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ధర్మం కోసం గురుగోవింద్ సింగ్ పిల్లలు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ప్రాణత్యాగం చేసిన డిసెంబర్ 26న నిర్వహించాలన్నారు. ప్రధాని సూచనలతో DEC 26ను వీర్ బాల్ దివస్‌గా ప్రతి పాఠశాలలో నిర్వహించాలని కేంద్రం ఆదేశించినట్లు తెలిపారు. వీర్ బాల్ దివస్‌ను పాఠ్యాంశంగా చేర్చే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు.