News November 1, 2024
కూతురు పేరు వెల్లడించిన దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన కుమార్తె పేరును వెల్లడించారు. ఆమెకు ‘దువా పదుకొణె సింగ్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. దువా అంటే ప్రార్థన అని, మా ప్రార్థనలకు ఆమె సమాధానం’ అని దీపిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా 38 ఏళ్ల దీపిక.. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ సెప్టెంబర్‌లో పాప జన్మించింది.
Similar News
News December 9, 2024
కేరళలో BJP కొత్త గేమ్ ప్లాన్!
పదేళ్లలో కేరళలో పాగా వేయడానికి BJP ఒక స్ట్రాటజీని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ హిందువులు 54, ముస్లిములు 27, క్రైస్తవులు 18% ఉన్నారు. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫీలవుతూ LDFను వీడుతున్న హిందూ, క్రైస్తవులను BJP చేరదీస్తోంది. క్రైస్తవ మత పెద్దలతో సమావేశమవుతూ మద్దతు సంపాదిస్తోంది. తాజాగా జార్జ్ జాకబ్ కూవకడ్ కార్డినల్ వేడుకకు ఓ బృందాన్ని వాటికన్‌కు పంపించింది.
News December 9, 2024
బాలిక నోట్లో దుస్తులు కుక్కి, పెట్రోల్ పోసి..
AP: నంద్యాల(D)లో ఇంటర్ విద్యార్థిని <<14828564>>హతమార్చిన<<>> ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడిని వెల్దుర్తి(M) కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగా గుర్తించారు. ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న దుర్మార్గుడు ఇవాళ తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న బాలిక నోట్లో దుస్తులు కుక్కి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అక్కడే మృతి చెందింది. అతడు కూడా నిప్పటించుకోగా, పరిస్థితి విషమంగా ఉంది.
News December 9, 2024
హాస్టల్‌లో ఇంటర్ బాలిక ప్రసవం.. బిడ్డను విసిరేసిన వైనం
AP: ఏలూరులోని ఓ మిషనరీ సంస్థ హాస్టల్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఓ ఇంటర్ బాలిక ఆడ బిడ్డను ప్రసవించింది. సహచరులు భయంతో నాలుగో అంతస్తు నుంచి ముళ్ల పొదల్లోకి శిశువును విసిరేయడంతో చనిపోయింది. ఈ దృశ్యాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బాలికను ఆస్పత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. బాలిక గర్భం దాల్చడంలో నిర్వాహకుల ప్రమేయం ఉందా? అని ఆరా తీస్తున్నారు.