News November 2, 2024
అమెరికన్లలో మళ్లీ అవే భయాలు!
పెన్సిల్వేనియాలో ఓట్ల అవకతవకలపై ఆరోపణలు చేయడం ద్వారా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సవాల్ చేయవచ్చనే ఆందోళనలు ఊపందుకున్నాయి. గత ఎన్నికల ఫలితాల్ని సవాల్ చేస్తూ జనవరి 6, 2021న తన అనుచరులతో క్యాపిటల్ భవనం వద్ద ట్రంప్ చేసిన ఆందోళనలను తాజా ఆరోపణలు గుర్తు చేస్తున్నాయని అంటున్నారు. అయితే, ఓటర్ ఫ్రాడ్‌పై ఆధారాలు లేవని ఎన్నికల అధికారులు తేల్చారు.
Similar News
News November 2, 2024
గవర్నర్ ప్రతిభా అవార్డులు.. నేటి నుంచి దరఖాస్తులు
TG: ఏటా 4 రంగాల ప్రముఖులకు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ నిర్ణయించారు. పర్యావరణం, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో ఉత్తమ సేవలు అందించినవారికి అవార్డులు ఇస్తారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు https://governor.telangana.gov.in/లో అప్లై చేసుకోవచ్చు. అవార్డు కింద ₹2L, జ్ఞాపిక ఇవ్వనున్నట్లు గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
News November 2, 2024
సుమతీ నీతి పద్యం: విచక్షణ కలిగినవారు ఎవరు?
వినదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
తాత్పర్యం: ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి. ఆ తర్వాత సత్యమేదో, అసత్యమేదో తెలుసుకున్నవారే విచక్షణ కలిగినవారు అని భావం.
News November 2, 2024
బీజేపీ రెబల్స్‌కు శివసేన, ఎన్సీపీ టిక్కెట్లు
మహారాష్ట్ర ఎన్నికల్లో 16 మంది BJP రెబల్స్‌కు శివసేన, NCP టిక్కెట్లు కేటాయించాయి. టిక్కెట్లు పొందని BJP నేతలు ఆ పార్టీని వీడి మహాయుతి మిత్రపక్షాలైన శివసేన, NCPలో చేరారు. ఈ 16 మందిలో 12 మందికి షిండే, నలుగురికి అజిత్ టిక్కెట్లు కట్టబెట్టారు. దీంతో బీజేపీ రెబల్స్ వల్ల మహాయుతికి నష్టం కలగకుండా మిత్రపక్షాలు తమ వైపు తిప్పుకున్నాయి. అయితే, వారిని BJPనే పంపిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.