News November 2, 2024
అమెరికన్లలో మళ్లీ అవే భయాలు!
పెన్సిల్వేనియాలో ఓట్ల అవకతవకలపై ఆరోపణలు చేయడం ద్వారా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సవాల్ చేయవచ్చనే ఆందోళనలు ఊపందుకున్నాయి. గత ఎన్నికల ఫలితాల్ని సవాల్ చేస్తూ జనవరి 6, 2021న తన అనుచరులతో క్యాపిటల్ భవనం వద్ద ట్రంప్ చేసిన ఆందోళనలను తాజా ఆరోపణలు గుర్తు చేస్తున్నాయని అంటున్నారు. అయితే, ఓటర్ ఫ్రాడ్‌పై ఆధారాలు లేవని ఎన్నికల అధికారులు తేల్చారు.
Similar News
News December 6, 2024
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రమాదకరం: కేజ్రీవాల్
బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రమాదకరమని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఢిల్లీ ఓటర్లను హెచ్చరించారు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఆప్ పథకాలను నిలిపివేస్తారని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ట్రాలో ఉచిత విద్యుత్ ఎక్కడ ఇస్తున్నారని, మంచి స్కూల్స్, ఆస్పత్రులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. గెలవలేమని తెలిసే ఢిల్లీలో ఆప్ ఓటర్ల తొలగింపునకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు.
News December 6, 2024
PHOTO: గన్నుతో సీఎం రేవంత్
TG: ప్రజాపాలన-విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హోంశాఖ విజయాలపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఆయుధాల ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. గన్నులు, రైఫిల్స్ పనితీరును ఆసక్తిగా పరిశీలించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోనే ఇది. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
News December 6, 2024
ఆర్టీసీ పికప్ వ్యాన్‌ల సేవలు ప్రారంభం
TGSRTC దూర ప్రాంత ప్రయాణికుల కోసం పికప్ వ్యాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడతలో ECIL-LB నగర్ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ సేవలను ప్రారంభించింది. విశాఖ, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కాకినాడ, కందుకూరు వెళ్లే వారి కోసం ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ సూచించింది.