News November 2, 2024

త్వరలో టిడ్కో ఇళ్ల పంపిణీ: మంత్రి డోలా

image

AP: పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. దీపం పథకం కింద 1.43 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించామని ఒంగోలులో తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. త్వరలోనే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Similar News

News November 2, 2024

మార్చి 27న లూసిఫర్-2 రిలీజ్

image

మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా L2:ఎంపురాన్ మూవీ తెరకెక్కుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో మోహన్‌లాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టొవినో, దుల్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా లూసిఫర్‌ను తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో చిరంజీవి రీమేక్ చేశారు.

News November 2, 2024

14 నుంచి వార్డెన్ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన

image

TG: సంక్షేమ హాస్టళ్లలో వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ తదితర పోస్టుల భర్తీకి ఈ నెల 14 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉ.10.30 నుంచి సా.5 వరకు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో పరిశీలన ఉంటుందన్నారు. అనివార్య కారణాలతో హాజరుకాలేని వారికి డిసెంబర్ 2-4 రిజర్వుడేగా ప్రకటించామన్నారు. మొత్తంగా 581 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/

News November 2, 2024

నేటి నుంచి ‘గుంతల రహిత రోడ్లు’ కార్యక్రమం

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ విజయనగరం జిల్లా గజపతినగరంలో పర్యటిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ‘గుంతల రహిత రోడ్ల నిర్మాణం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జనవరి 15 నాటికి రూ.860 కోట్లతో రాష్ట్రంలోని అన్ని రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్లకు ఇరువైపులా కంప చెట్లను కొట్టేయడంతోపాటు కల్వర్టుల నిర్మాణాన్ని చేపడుతుంది. ఇందుకోసం SRM వర్సిటీ, IIT తిరుపతితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.