News November 2, 2024
త్వరలో టిడ్కో ఇళ్ల పంపిణీ: మంత్రి డోలా
AP: పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. దీపం పథకం కింద 1.43 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించామని ఒంగోలులో తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. త్వరలోనే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2024
12న ‘SDT18’ టైటిల్, గ్లింప్స్
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘SDT18’ టైటిల్, గ్లింప్స్‌ను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కత్తి పట్టుకుని ఉన్న పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీన్నిబట్టి తేజ్ ఈసారి మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో రోహిత్ కేపీ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. ఐశ్వర్య లక్ష్మి, అనన్య నాగళ్ల కీలకపాత్రలో నటిస్తున్నారు.
News December 6, 2024
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
తెలంగాణకు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలు, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం ప్రకటించింది. TGలోని జగిత్యాల, NZB, కొత్తగూడెం, మేడ్చల్, MBNR, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు నవోదయ విద్యాలయాలను కేటాయించింది. ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులో వలసపల్లె, సత్యసాయి జిల్లాలో పాలసముద్రం, గుంటూరులో తాళ్లపల్లె, రొంపిచర్ల, కృష్ణాలో నూజివీడు, నందిగామ, నంద్యాలలోని డోన్‌లో KVBల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
News December 6, 2024
ప్రత్యర్థి పార్టీ నేత కుమార్తెతో కొడుకు పెళ్లి.. సీనియర్ లీడర్ సస్పెండ్
కొడుకు పెళ్లి పార్టీ క్రమశిక్షణారాహిత్యం కిందికి వస్తుందని ఆ BSP నేత ఊహించి ఉండకపోవచ్చు. కానీ అదే జరిగింది. UPలోని రాంపూర్ జిల్లా BSP నేత సురేంద్ర సాగర్ తన కుమారుడి పెళ్లి SP MLA త్రిభువన్ దత్ కుమార్తెతో చేశారు. దీంతో ప్రత్యర్థి పార్టీ నేతతో సంబంధం కుదుర్చుకున్నందుకు సీనియర్ నేత అని కూడా చూడకుండా సురేంద్రతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిని కూడా చీఫ్ మాయావతి సస్పెండ్ చేశారు.