News November 2, 2024

జూన్ కల్లా రేవంత్‌ను దింపేస్తారు: మహేశ్వర్ రెడ్డి

image

TG: వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ స్థానంలో ఉత్తమ్ లేదా భట్టివిక్రమార్కకు సీఎం పదవి దక్కొచ్చన్నారు. ఆ పార్టీలోని ఓ వర్గం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందని చెప్పారు. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ అడ్లూరి ఖండించారు.

Similar News

News December 26, 2024

కొత్త ఏడాదిలో చైనా, అమెరికాకు ప్రధాని మోదీ?

image

కొత్త సంవత్సరంలో PM మోదీ పర్యటనల క్యాలెండర్‌ను విదేశీ వ్యవహారాల శాఖ సిద్ధం చేస్తోంది. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ట్రంప్‌ అధ్యక్షుడిగా అధికారం స్వీకరించిన అనంతరం ఆయనతో భేటీ అయ్యేందుకు మోదీ US వెళ్లే అవకాశం ఉంది. ఇక బ్రెజిల్‌లో బ్రిక్స్, చైనాలో SCO సదస్సుకు ప్రధాని హాజరుకానున్నారు. ఈక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఆయన ప్రత్యేకంగా ద్వైపాక్షిక భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

News December 26, 2024

భాగ‌వ‌త్‌తో విభేదించిన RSS మ్యాగ‌జైన్‌

image

మసీదు-మందిర్ వివాదాల‌పై RSS చీఫ్ మోహ‌న్ భాగ‌వ‌త్‌తో ఆ శాఖ అనుబంధ మ్యాగ‌జైన్ విభేదించింది. ఈ త‌ర‌హా వివాదాలు అధిక‌మ‌వుతుండ‌డంపై భాగ‌వ‌త్ గ‌తంలో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. భార‌తీయులు క‌లిసి ఉండ‌గ‌ల‌ర‌న్న ఐక్య‌త చాటాల‌ని పిలుపునిచ్చారు. అయితే RSSకు చెందిన ఓ మ్యాగ‌జైన్ మాత్రం సివిలైజేష‌న్ జ‌స్టిస్ కోసం వివాదాస్పద స్థలాలు, నిర్మాణాల వాస్తవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొనడం గమనార్హం.

News December 26, 2024

ముఖ్యమంత్రి పదవినే వద్దనుకున్నా: సోనూ సూద్

image

తనకు రాజకీయాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని సినీ నటుడు సోనూ సూద్ తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు వంటి పదవుల ఆఫర్లు వచ్చాయని చెప్పారు. ‘కొందరు బడా నేతలు నన్ను సీఎంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. కానీ నేను దానికి అంగీకరించలేదు. నేను రాజకీయాల్లోకి వస్తే జవాబుదారీతనంతో ఉండాలి. కానీ అది నాకు నచ్చదు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా సేవ చేస్తున్నా. ఇకపై కూడా ఇలాగే ఉంటా’ అని ఆయన చెప్పుకొచ్చారు.