News November 2, 2024
జూన్ కల్లా రేవంత్‌ను దింపేస్తారు: మహేశ్వర్ రెడ్డి
TG: వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ స్థానంలో ఉత్తమ్ లేదా భట్టివిక్రమార్కకు సీఎం పదవి దక్కొచ్చన్నారు. ఆ పార్టీలోని ఓ వర్గం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందని చెప్పారు. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ అడ్లూరి ఖండించారు.
Similar News
News December 7, 2024
తెలంగాణలోనే ఎక్కువ సిజేరియన్లు
తెలంగాణలో సిజేరియన్లు ఎక్కువగా ఉన్నట్లు NFHS ఆధారంగా ఢిల్లీలోని జార్జ్ ఇన్‌స్టిట్యూట్ స్టడీ తెలిపింది. ఇక్కడ మొత్తం ప్రసవాల్లో 60.7% సిజేరియన్లేనని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇది 21.5 శాతంగా ఉంది. అత్యల్పంగా నాగాలాండ్‌లో 5.2% సిజేరియన్లు జరుగుతున్నాయి. దక్షిణాదిలోనే సిజేరియన్లు ఎక్కువగా ఉన్నాయి. సహజ ప్రసవాలపై భయం, ముహూర్తాలు చూసుకోవడం, ఆర్థిక స్తోమత వంటి అంశాలు సిజేరియన్లకు కారణాలవుతున్నాయి.
News December 7, 2024
TFDC ఛైర్మన్‌గా నిర్మాత దిల్ రాజు
TG: సినీ నిర్మాత దిల్ రాజుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాజును నియమిస్తూ CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు. కాగా గత ఎన్నికల్లో దిల్ రాజు కాంగ్రెస్ తరఫున MP లేదా MLAగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగలేదు. తెర వెనుక ఆయన కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లు టాక్.
News December 7, 2024
గాజాలో మిన్నంటిన ఆకలి కేకలు
ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రజలు ఆహారం లేక అలమటిస్తున్నారు. ఖాన్ యూనిస్‌లో ఉన్న శరణార్థి శిబిరంలోని ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదు. ఆ శిబిరం వద్ద మహిళలు, బాలికలు ఆహారం కోసం పోటీపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి ఆహారం పంపిణీ చేసింది. కానీ ఇటీవల దానిని నిలిపివేసింది. దీంతో అక్కడి ప్రజలకు ఆహారం అందటం లేదు.