News November 2, 2024

రేషన్‌లో బియ్యం, పంచదార, కందిపప్పు, జొన్నలు

image

AP: రాష్ట్రంలో రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి రేషన్‌లో జొన్నలను కూడా ప్రభుత్వం చేర్చింది. బియ్యం వద్దనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. గరిష్ఠంగా 3KGల వరకు ఇస్తారు. ఇటు పంచదార, కందిపప్పుని సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ నెల నుంచి 100% రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా చర్యలు తీసుకున్నారు. రూ.67కి కందిపప్పు, అరకేజీ పంచదార రూ.17కు ఇస్తున్నారు.

Similar News

News November 2, 2024

BREAKING: రెండో దశ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

image

TG: హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జీవో 196 జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 76.4 కి.మీ మేర రూ.24,269 కోట్ల వ్యయంతో దీనిని చేపడుతున్నారు. ఇందులో రాష్ట్ర వాటా, రూ.7,313 కోట్లు, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు, జికా, ఏడీబీ, ఎన్డీబీ వాటా రూ.11,693 కోట్లుగా ఉంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తారు.

News November 2, 2024

ప్ర‌సిద్ధ శైవ క్షేత్రాల‌కు స్పెష‌ల్ బ‌స్సుల‌ు: TGSRTC

image

కార్తీక మాసంలో ప్ర‌సిద్ధ శైవ క్షేత్రాల‌కు HYD నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని TGSRTC MD సజ్జనార్ తెలిపారు. ఈ నెల 15న అరుణాచ‌లానికి ప్ర‌త్యేక ప్యాకేజీని అందిస్తున్నామ‌ని, APలోని పంచారామాల‌కు ప్ర‌తి సోమ‌వారం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. http://tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. వివ‌రాల‌కు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్ర‌దించాల‌న్నారు.

News November 2, 2024

సంతానం విషయంలో చంద్రబాబు కరెక్ట్: అసదుద్దీన్

image

TG: ఎక్కువ మంది సంతానం ఉండాలని AP, TN CMలు చంద్రబాబు, స్టాలిన్ అంటున్నారని, కానీ అదే విషయాన్ని తానంటే రాద్ధాంతం చేసేవారని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘దక్షిణాదిలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారు. ఒక వేళ జనాభా ప్రకారం నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి ఎంతో నష్టం కలుగుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.