News November 2, 2024

రేషన్‌లో బియ్యం, పంచదార, కందిపప్పు, జొన్నలు

image

AP: రాష్ట్రంలో రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి రేషన్‌లో జొన్నలను కూడా ప్రభుత్వం చేర్చింది. బియ్యం వద్దనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. గరిష్ఠంగా 3KGల వరకు ఇస్తారు. ఇటు పంచదార, కందిపప్పుని సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ నెల నుంచి 100% రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా చర్యలు తీసుకున్నారు. రూ.67కి కందిపప్పు, అరకేజీ పంచదార రూ.17కు ఇస్తున్నారు.

Similar News

News December 8, 2024

AUSvsIND: అమ్మాయిలూ ఓడిపోయారు!

image

ఈరోజు భారత్‌ను ఆస్ట్రేలియా రెండు వేర్వేరు మ్యాచుల్లో ఓడించింది. ఓవైపు అడిలైడ్ టెస్టులో గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు బ్రిస్బేన్‌లో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లోనూ భారత అమ్మాయిల్ని ఆస్ట్రేలియా ఉమెన్ ఓడించారు. 372 రన్స్ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత్ 44 ఓవర్లలో 249కి ఆలౌటైంది. దీంతో 3 మ్యాచుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

News December 8, 2024

RECORD: పెంట్ హౌస్‌కు రూ.190కోట్లు

image

హరియాణాలోని గురుగ్రామ్‌లో DLF కామెలియాస్‌లో ఓ పెంట్ హౌస్ అపార్ట్‌మెంట్ (16,290 sq ft) ₹190కోట్లకు అమ్ముడైంది. ఒక్క sq ft ₹1.8లక్షలు పలికి దేశంలోనే అత్యధిక ధర పలికిన ఫ్లాట్‌గా నిలిచిందని రియల్ ఎస్టేట్ వర్గాలు తెలిపాయి. దీనిని ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్ వేర్ సంస్థ డైరెక్టర్ రిషి పార్తీ కొన్నారు. కార్పెట్ ఏరియాల్లో ఈ ధరే అత్యధికమని, ముంబైలో sq ftకి ₹1,62,700 ఉండొచ్చని రియల్ ఎస్టేట్ అనలిస్టులు చెబుతున్నారు.

News December 8, 2024

చంద్రబాబుకు ముప్పు తలపెట్టేలా VSR వ్యాఖ్యలు: వర్ల రామయ్య

image

AP: ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబుకు ముప్పు తలపెట్టేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను డీజీపీ, HRC సీరియస్‌గా తీసుకోవాలన్నారు. VSR, అతని బృందం కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. Dy.CM పవన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే CM చంద్రబాబు లక్ష్యమని విజయసాయి విమర్శించిన విషయం తెలిసిందే.