News November 3, 2024

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సర్వ దర్శనాలు రద్దు చేశారు. మరోవైపు స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

Similar News

News September 16, 2025

సిరిసిల్ల: ‘ద్వితీయ మహాసభలు విజయవంతం చేయాలి’

image

ఈనెల 23, 24న జరిగే కెవిపిఎస్ జిల్లా ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు అన్నారు. సిరిసిల్లలో మహాసభల కరపత్రాలను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ.. 2003 ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, 2013 దళితుల శవాలను పూడ్చడానికి ప్రభుత్వం రెండెకరాల స్మశాన స్థలం ఇవ్వాలన్న జీవో నంబర్ 1234లను కెవిపిఎస్ పోరాడి సాధించిందన్నారు.

News September 16, 2025

రూ.1,779 కోట్లు చెల్లించాం.. బంద్ ఆపండి: ఆరోగ్యశ్రీ సీఈవో

image

TG: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలను ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,779 కోట్లను హాస్పిటళ్లకు చెల్లించామని తెలిపారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సగటున నెలకు రూ.57 కోట్లు హాస్పిటళ్లకు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ సగటున నెలకు ₹75 కోట్లు చెల్లించామని వివరించారు.

News September 16, 2025

ఆ విగ్రహం మహావిష్ణువుది కాదు.. శనీశ్వరుడుది: AP FactCheck

image

AP: తిరుపతి అలిపిరిలో శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉందంటూ YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రచారం అసత్యమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఆ విగ్రహం అసంపూర్ణంగా చెక్కిన శనీశ్వరునిదని స్పష్టం చేసింది. ‘విగ్రహం తయారీలో లోపం కారణంగా శిల్పి పట్టు కన్నయ్య దీనిని ఇక్కడే వదిలేశారు. పదేళ్లుగా ఈ విగ్రహం ఇక్కడే ఉంది. ఇలాంటి పోస్టులను ఎవరూ సోషల్ మీడియాలో షేర్, పోస్ట్ చేయవద్దు’ అని పేర్కొంది.