News November 3, 2024

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సర్వ దర్శనాలు రద్దు చేశారు. మరోవైపు స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

Similar News

News December 11, 2024

BREAKING: మంచు విష్ణుకు వార్నింగ్!

image

TG: సినీ హీరో మంచు విష్ణుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి గొడవలు జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని సమాచారం. నాలుగు రోజులుగా కుటుంబంలో నెలకొన్న వివాదంపై ఆయన ఆరా తీశారు. జల్‌పల్లి నివాసం నుంచి ప్రైవేట్ సెక్యూరిటీని పంపించాలని విష్ణును సీపీ ఆదేశించారు. ఇంటి వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలన్నారు.

News December 11, 2024

చైనాలో విజయ్ మూవీకి భారీ కలెక్షన్లు

image

విజయ్ సేతుపతి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘మహారాజ’ చైనా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ 12 రోజుల్లోనే దాదాపు 70 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో 2018లో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తర్వాత చైనాలో అత్యధిక కలెక్షన్లు చేసిన చిత్రంగా నిలిచింది. తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం.

News December 11, 2024

60 ఏళ్లలో వ్యాపారం స్టార్ట్ చేసి.. రూ.49వేల కోట్లకు!

image

ఒకప్పుడు సాధారణ ఉద్యోగ జీవితం గడిపిన లక్ష్మణ్ దాస్ మిట్టల్.. 60 ఏళ్ల వయసులో వ్యాపారాన్ని మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. 1990లో LIC నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత సోనాలికా ట్రాక్టర్స్ గ్రూప్‌ను స్థాపించారు. తర్వాత కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో కలిసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం 94 సంవత్సరాల వయస్సులో రూ.49,110 కోట్లతో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.