News November 5, 2024
సీనియర్ IPSకు బెదిరింపులు.. కుమార స్వామిపై కేసు నమోదు
కేంద్ర మంత్రి కుమార స్వామి, అయన కుమారుడు నిఖిల్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ అనుమతుల మంజూరు కేసులో దర్యాప్తు చేస్తున్నతనను కుమార స్వామి బహిరంగంగా బెదిరించారని ఆరోపిస్తూ సిట్ చీఫ్, ADGP చంద్రశేఖర్ ఈ ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా కర్ణాటక క్యాడర్ నుంచి మరో క్యాడర్‌కు బదిలీ చేయిస్తానని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News November 5, 2024
జగన్.. ఐదేళ్లలో నువ్వేం చేశావ్?: మంత్రి అనిత
AP: ఇప్పుడు లా&ఆర్డర్ గురించి మాట్లాడుతున్న జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం చేశారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు వైసీపీ పాపాలే కారణమన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. వాస్తవాలను కాకుండా జగన్ సైకో బ్యాచ్ సోషల్ మీడియాలో తమపై బురదజల్లుతూ, జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు.
News November 5, 2024
ట్రంప్ గెలిస్తే నిజంగానే ‘పెద్ద’న్న అవుతారు!
అమెరికా ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అధిక వయస్కుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలువనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ వయసు 81 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం ఆయన ప్రమాణస్వీకారం చేసిన నాటి వయసుతో పోల్చితే ట్రంప్ వయసు ఐదు నెలలు అధికం. ఈ లెక్కన ట్రంప్ గెలిస్తే అధ్యక్షుడిగా ప్రమాణం చేసే పెద్ద వయస్కుడిగా (78 ఏళ్ల నాలుగు నెలలు) చరిత్ర సృష్టిస్తారు.
News November 5, 2024
తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్: రాహుల్
TG: తెలంగాణలో చేసే కులగణన ప్రక్రియ దేశానికి రోల్ మోడల్ అవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దేశంలో కుల వివక్ష ఉందని, అది అగ్రకులాలకు ఎప్పుడూ కనిపించదని తెలిపారు. ఇదే విషయం తాను చెబితే దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తారని వ్యాఖ్యానించారు. అందులో నిజాన్ని పరిశీలించాలని, వాస్తవాలను అన్వేషిస్తూ ముందుకు వెళ్లాలని రాహుల్ కోరారు.