News November 5, 2024
విద్యార్థినులను పరామర్శించిన మంత్రులు పొన్నం, సురేఖ

TG: ఫుడ్ పాయిజన్‌తో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ విద్యార్థినులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
Similar News
News January 13, 2026
టాక్సిక్ టీజర్ వివాదం.. సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదన్న CBFC

కన్నడ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ టీజర్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అశ్లీల సన్నివేశాలపై ఆప్ <<18843954>>ఫిర్యాదు<<>> చేయడంతో వివరణ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు కర్ణాటక మహిళా కమిషన్ లేఖ రాసింది. దీంతో యూట్యూబ్‌లో విడుదల చేసే టీజర్లకు సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదని CBFC తెలిపింది. థియేటర్లలో ప్రదర్శించే వాటికే పర్మిషన్ అవసరమని, యూట్యూబ్ డిజిటల్ ప్లాట్‌ఫాం కావడంతో తమ పరిధిలోకి రాదని చెప్పింది.
News January 13, 2026
670 సార్లు అప్లై చేసినా పట్టించుకోలేదు.. కట్ చేస్తే..

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కంటే తెలివితక్కువ పని ఇంకోటి లేదంటున్నారో టెకీ. ‘రిక్రూటర్లకు 670 అప్లికేషన్లు, 1000 మెసేజ్‌లు పంపినా పట్టించుకోలేదు. దీంతో దరఖాస్తులు ఆపేశా. వ్యక్తిగతంగా ప్రొడక్ట్ బిల్డింగ్, కంటెంట్ క్రియేషన్, నెట్‌వర్కింగ్‌పై ఫోకస్ చేశా. జనవరి-మే మధ్య 83మంది రిక్రూటర్లు సంప్రదించారు’ అని మర్మిక్ పటేల్ అనే వ్యక్తి తెలిపారు. మెటాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు చెప్పారు.
News January 13, 2026
నెలసరికి ముందు రొమ్ము నొప్పా?

నెలసరికి ముందు వక్షోజాల్లో నొప్పి, బరువుగా ఉన్నట్లు అనిపించడం లాంటి సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీన్ని ‘ప్రీ మెన్‌స్ట్రువల్ మాస్టాల్జియా’గా పిలుస్తారు. ఒక వయసు వచ్చాక అండం విడుదల సమయంలో వెలువడే ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఈ నొప్పికి కారణం. అయితే ఈ నొప్పి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణం ఏమో అని చాలా మంది భయపడతారు. కానీ అది అపోహే అంటున్నారు నిపుణులు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.


