News November 5, 2024
విద్యార్థినులను పరామర్శించిన మంత్రులు పొన్నం, సురేఖ
TG: ఫుడ్ పాయిజన్‌తో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ విద్యార్థినులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
Similar News
News December 6, 2024
ఓటీటీలోకి వచ్చేసిన ‘జిగ్రా’ మూవీ
వాసన్ బాల డైరెక్షన్‌లో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘జిగ్రా’ ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఓ అక్రమ కేసులో తమ్ముడు జైలుకు వెళ్లకుండా కాపాడుకునే పాత్రలో ఆలియా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
News December 6, 2024
గుండె గూటిలో ‘మినీ బ్రెయిన్’!
గుండెలో సొంత నరాల వ్యవస్థ ఉందని, దానినే మినీ బ్రెయిన్‌గా పిలుస్తారని కొలంబియా యూనివర్సిటీ కొత్త స్టడీ తెలిపింది. గుండె లయ నియంత్రణలో దీనిదే కీలక పాత్రని పేర్కొంది. ఇన్నాళ్లూ నరాల వ్యవస్థ ద్వారా మెదడు పంపించే సంకేతాలు పొంది పనిచేస్తుందన్న భావనను ఈ స్టడీ సవాల్ చేసింది. హృదయ కుడ్యాల్లోని సంక్లిష్ట న్యూరాన్స్ నెట్‌వర్క్‌ను గుర్తించింది. మనిషిని పోలిన గుండె కలిగిన జీబ్రాఫిష్‌ను ఈ టీమ్ స్టడీచేసింది.
News December 6, 2024
‘మారుతీ’ కార్లు కొనేవారికి షాక్
ప్రముఖ కంపెనీలు ఆడి, <<14802633>>హ్యుందాయ్<<>> తరహాలోనే మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. 2025 జనవరి నుంచి కనీసం 4శాతం పెంచుతామని తెలిపింది. దీంతో కార్ల మోడళ్లను బట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది. ముడి సరకు, రవాణా, నిర్వహణ ఖర్చులు పెరగడమే ఈ ధరల పెంపునకు కారణమని సంస్థ తెలిపింది. అయితే ఈ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయకతప్పడం లేదని పేర్కొనడం గమనార్హం.