News November 5, 2024

సుశాంత్‌ది ఆత్మహత్య కాదు హత్య: సల్మాన్ మాజీ ప్రేయసి

image

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంపై సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయ‌సి సోమీ అలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సుశాంత్‌ది ఆత్మహ‌త్య కాద‌ని, హ‌త్య అని ఆరోపించారు. దీనికి న‌టి జియా ఖాన్ విషాదాంతాన్ని ఉదహ‌రించారు. జియా గ‌ర్భ‌వ‌తిగా ఉన్నప్పుడు ఉరివేసుకొని కనిపించిందని, ఆమె మ‌ర‌ణం త‌ర్వాత స‌ల్మాన్ స‌ల‌హాల‌ను సూర‌జ్ పంచోలీ కోరార‌ని ఆరోపించారు. సల్మాన్ కంటే సీరియల్ కిల్లర్ టెడ్ బండీ నయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Similar News

News November 13, 2025

39పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 39 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ, CA/ICWAI, డిప్లొమా, బీఎస్సీ(MPC), ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష(CBT), ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bvfcl.com/

News November 13, 2025

ప్రతి ఒక్కరూ వేదాలను ఎందుకు చదవాలి?

image

వేదాలు దైవిక నాదస్వరూపాలు. వీటిని రుషులు లోకానికి అందించారు. ఇవి మంత్రాల సముదాయం మాత్రమే కాదు. మనిషి జీవితానికి మార్గదర్శకాలు కూడా! ఇవి మనల్ని అసత్యం నుంచి సత్యానికి నడిపిస్తాయి. చీకటి నుంచి వెలుగు వైపుకు తీసుకెళ్తాయి. మృత్యువు నుంచి మోక్షం వైపుకు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తాయి. నిత్య జీవితంలో ధైర్యాన్ని, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి వేదాలు తోడ్పడతాయి. <<-se>>#VedikVibes<<>>

News November 13, 2025

రండి.. ట్రైనింగ్ ఇచ్చి వెళ్లిపోండి: అమెరికా

image

H1B వీసా విధానంపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన కామెంట్లు చేశారు. ‘విదేశాల నుంచి వచ్చే వారిపై ఎక్కువ కాలం ఆధారపడకుండా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు పొందేలా అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. దానికోసం తాత్కాలికంగా విదేశీ కార్మికులను యూఎస్ తీసుకురావడమే H1B వీసా కొత్త విధానం. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. తరువాత తిరిగి వెళ్లిపోండి. జాబ్స్‌ అన్నీ అమెరికన్లే తీసుకుంటారు’ అని చెప్పారు.