News November 5, 2024

సుశాంత్‌ది ఆత్మహత్య కాదు హత్య: సల్మాన్ మాజీ ప్రేయసి

image

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంపై సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయ‌సి సోమీ అలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సుశాంత్‌ది ఆత్మహ‌త్య కాద‌ని, హ‌త్య అని ఆరోపించారు. దీనికి న‌టి జియా ఖాన్ విషాదాంతాన్ని ఉదహ‌రించారు. జియా గ‌ర్భ‌వ‌తిగా ఉన్నప్పుడు ఉరివేసుకొని కనిపించిందని, ఆమె మ‌ర‌ణం త‌ర్వాత స‌ల్మాన్ స‌ల‌హాల‌ను సూర‌జ్ పంచోలీ కోరార‌ని ఆరోపించారు. సల్మాన్ కంటే సీరియల్ కిల్లర్ టెడ్ బండీ నయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Similar News

News December 6, 2024

అల్లు అర్జున్‌కు జైలు శిక్ష పడుతుందా?

image

HYD సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి PSలో కేసు నమోదైంది. BNS చట్టంలోని సెక్షన్ 105(హత్య కాని ప్రాణనష్టం కేసు), 118(1) వంటి నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే 5 నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది. బన్నీ వస్తున్న విషయంపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏం జరుగుతుందో చూడాలి.

News December 6, 2024

STOCK MARKETS: ఐటీ, మీడియా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్

image

RBI MPC మీటింగ్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. వడ్డీరేట్ల తగ్గింపుపై రకరకాల అంచనాలు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 24,712 (+4), సెన్సెక్స్ 81,784 (+23) వద్ద ట్రేడవుతున్నాయి. IT, మీడియా, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఆటో, FMCG, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. TCS, LT, WIPRO టాప్ లూజర్స్.

News December 6, 2024

గ్రూప్-1,2,3 ఫలితాలు ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలో గ్రూప్-1, 3 పరీక్షలు జరగ్గా, ఈ నెలలో గ్రూప్-2 నిర్వహించనున్నారు. తొలుత గ్రూప్-1 ఫలితాలు, పోస్టుల భర్తీ.. ఆ తర్వాత గ్రూప్-2 ఫలితాలు, భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. చివర్లో గ్రూప్-3 ఫలితాలు రిలీజ్ చేస్తారని సమాచారం. ఇలా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అన్ని గ్రూప్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. మెరిట్ ఉన్న నిరుద్యోగులు అవకాశాలు కోల్పోకూడదని TGPSC ఇలా కొత్త విధానం అమలు చేయనున్నట్లు సమాచారం.