News November 6, 2024
మందుబాబులకు BIG SHOCK?
తెలంగాణలో లిక్కర్ రేట్ల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీరుపై రూ.15-20, క్వార్టర్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.10 నుంచి రూ.80 వరకు పెంచే అవకాశం ఉంది. సగటున 20-25శాతం వరకు ధరలు పెంచి, నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 6, 2024
నిందితుడిని పట్టించిన ఈగలు..!
మధ్యప్రదేశ్‌లో ఓ హత్య కేసు నిందితుడిని ఈగలు పట్టించాయి. జబల్పూర్ జిల్లాకు చెందిన మనోజ్ ఠాకూర్ (25) హత్యకు గురయ్యాడు. హత్యాస్థలంలో విచారణ చేస్తుండగా గుంపులోని ధరమ్ ఠాకూర్ (19) అనే వ్యక్తిపై ఈగలు వాలడాన్ని పోలీసులు గమనించారు. అతడి దుస్తులు, ఛాతిపై రక్తపు మరకలు ఉన్నాయి. ఫొరెన్సిక్ టెస్ట్‌లో మృతుడి రక్తపు మరకలేనని తేలింది. మద్యం తాగే క్రమంలో గొడవ జరిగి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు
News November 6, 2024
ON THIS DAY: అండమాన్‌ను స్వాధీనం చేసుకున్న నేతాజీ
జపాన్ ఇంపీరియల్ ఫోర్స్ ఆక్రమణలో ఉన్న అండమాన్ నికోబార్ దీవిని 1943లో ఇదేరోజున భారత సైన్యం సుప్రీం కమాండర్ సుభాష్ చంద్రబోస్ స్వాధీనం చేసుకున్నారు. టోక్యోలో జపాన్ ప్రధానిని కలిసిన తర్వాత నవంబర్ 6, 1943న A&N దీవులను భారత్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అనంతరం 30 డిసెంబర్ 1943న భారత గడ్డపై తొలిసారిగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని నేతాజీ ఎగురవేశారు.
News November 6, 2024
పార్కింగ్‌లో జపాన్ ఉద్యోగుల కొత్త పద్ధతి!
జపాన్ టెక్నాలజీలో దూసుకెళ్తూనే సరికొత్త పద్ధతులను తీసుకొస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. అక్కడ ఆఫీసుకు లేటుగా వచ్చే ఉద్యోగుల కోసం ఇంట్రెస్టింగ్ రూల్‌ను అమలు చేస్తున్నారు. ముందుగా కార్యాలయానికి వచ్చిన వారు తమ కారును దూరంగా పార్క్ చేయాలి. అలా చేయడం వల్ల ఆలస్యంగా వచ్చేవారు తమ కారును దగ్గరగా పార్క్ చేసి సమయానికి ఆఫీసుకు వచ్చేలా చేస్తుంది. ఉద్యోగులు పరస్పరంగా ఇలా ఒప్పందం చేసుకుంటారని తెలుస్తోంది.