News November 6, 2024
మందుబాబులకు BIG SHOCK?
తెలంగాణలో లిక్కర్ రేట్ల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీరుపై రూ.15-20, క్వార్టర్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.10 నుంచి రూ.80 వరకు పెంచే అవకాశం ఉంది. సగటున 20-25శాతం వరకు ధరలు పెంచి, నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 6, 2024
కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బ్యాడ్ న్యూస్
AP: కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ సంక్రాంతికి పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 2 నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందని వార్తలు వచ్చినా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. మరోవైపు సివిల్ సప్లైస్ శాఖ మాత్రం తమ వైపు ఎలాంటి ఆటంకాలు లేవని చెబుతోంది. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటోంది.
News December 6, 2024
పోతూ పోతూ ‘RBI దాస్’ గుడ్‌న్యూస్ చెప్తారా!
RBI గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం DEC 10న ముగుస్తుంది. మరోసారి అవకాశం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. దీంతో చివరి MPC మీటింగులోనైనా ఆయన వడ్డీరేట్లను తగ్గించి ఊరట కల్పిస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రెపోరేటు 6.5, CRR 4.5 శాతంగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో దేశ GDP భారీగా పడిపోవడానికి వీటిని తగ్గించకపోవడమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. మరి దాస్ నేడేం చేస్తారో చూడాలి.
News December 6, 2024
కుత్బుల్లాపూర్ MLA ఇంటి వద్ద ఉద్రిక్తత
TG: కుత్బుల్లాపూర్ MLA వివేకానంద ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టగా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు, పల్లా అరెస్టుల నేపథ్యంలో BRS శ్రేణులు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు.