News November 6, 2024

ON THIS DAY: అండమాన్‌ను స్వాధీనం చేసుకున్న నేతాజీ

image

జపాన్ ఇంపీరియల్ ఫోర్స్ ఆక్రమణలో ఉన్న అండమాన్ నికోబార్ దీవిని 1943లో ఇదేరోజున భారత సైన్యం సుప్రీం కమాండర్‌ సుభాష్ చంద్రబోస్ స్వాధీనం చేసుకున్నారు. టోక్యోలో జపాన్ ప్రధానిని కలిసిన తర్వాత నవంబర్ 6, 1943న A&N దీవులను భారత్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అనంతరం 30 డిసెంబర్ 1943న భారత గడ్డపై తొలిసారిగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని నేతాజీ ఎగురవేశారు.

Similar News

News September 15, 2025

ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, సిద్దిపేటలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇతర చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. నిన్న రాత్రి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచి కొట్టిన సంగతి తెలిసిందే.

News September 15, 2025

సుప్రీంకోర్టులో కోర్టు మాస్టర్ ఉద్యోగాలు

image

<>సుప్రీంకోర్టులో<<>> 30 కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్) గెజిటెడ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులైన, స్టెనోగ్రాఫర్‌గా ఐదేళ్ల అనుభవం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, OBC, దివ్యాంగులకు రూ.750. రాతపరీక్ష, షార్ట్ హ్యాండ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sci.gov.in/

News September 15, 2025

తెలంగాణ అప్డేట్స్

image

* సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ విలీన దినోత్సవం’గా నిర్వహించాలని CM రేవంత్‌కు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని లేఖ
* ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16వరకు నిర్వహించే పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపు
* బీఈడీలో రెండో విడతలో 7,441 మందికి సీట్ల కేటాయింపు. ఇవాళ కాలేజీలో రిపోర్ట్ చేయాలని అధికారుల సూచన
* ఇవాళ్టి నుంచి నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్