News November 6, 2024

ON THIS DAY: అండమాన్‌ను స్వాధీనం చేసుకున్న నేతాజీ

image

జపాన్ ఇంపీరియల్ ఫోర్స్ ఆక్రమణలో ఉన్న అండమాన్ నికోబార్ దీవిని 1943లో ఇదేరోజున భారత సైన్యం సుప్రీం కమాండర్‌ సుభాష్ చంద్రబోస్ స్వాధీనం చేసుకున్నారు. టోక్యోలో జపాన్ ప్రధానిని కలిసిన తర్వాత నవంబర్ 6, 1943న A&N దీవులను భారత్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అనంతరం 30 డిసెంబర్ 1943న భారత గడ్డపై తొలిసారిగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని నేతాజీ ఎగురవేశారు.

Similar News

News December 8, 2024

ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు తెలుసా?

image

కొన్ని ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ రేటుతో దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని స్కీములు..
➤ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2%
➤ సుకన్య సమృద్ధి యోజన : 8%- 8.2%
➤ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7%
➤ కిసాన్ వికాస్ పాత్ర: 7.5%
➤ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: 7.4%
➤ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్: 7.1%

News December 8, 2024

బుమ్రాకు గాయమైందా?

image

అడిలైడ్‌లో జరుగుతున్న BGT రెండో టెస్టులో బౌలింగ్ చేస్తూ టీమ్ఇండియా బౌలర్ బుమ్రా ఇబ్బంది పడ్డారు. 81వ ఓవర్ వేస్తున్న సమయంలో గ్రౌండ్‌లో కిందపడగా, ఫిజియో వచ్చి చికిత్స అందించారు. బుమ్రాకు గాయమైందనే ఆందోళన నేపథ్యంలో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ క్లారిటీ ఇచ్చారు. గాయం కాలేదని కేవలం కాళ్లు తిమ్మిరెక్కాయన్నారు. రెండో ఇన్సింగ్స్‌లో 128/5 వద్ద ఉన్న భారత్ గెలవాలంటే బుమ్రా మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది.

News December 8, 2024

నేడు ట్యాంక్‌బండ్‌పై ఎయిర్ షో.. ట్రాఫిక్ ఆంక్షలు

image

TG: కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నేడు HYD ట్యాంక్‌బండ్‌పై ఎయిర్ షో నిర్వ‌హించ‌నున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో షో జరగనుండగా, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎయిర్ షో జరగనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి షో ముగిసే వరకు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.