News November 6, 2024
నా ప్రియ మిత్రుడు ట్రంప్‌కు శుభాకాంక్షలు: మోదీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గెలుపొంది 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘చరిత్రాత్మక విజయం పొందిన నా ప్రియ మిత్రుడికి శుభాకాంక్షలు. పరస్పర సహకారంతో భారత్-యూఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం. మన ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం విషెస్ తెలిపారు.
Similar News
News November 6, 2024
US ఎన్నికల ఫలితాలు.. ఆ గ్రామంలో నిరాశ
US అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ విజయంతో తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామస్థులు నిరాశకు గురయ్యారు. కమల పూర్వీకులది అదే ఊరు కావడంతో ఆమె ఈ ఎన్నికల్లో గెలవాలని వాళ్లు పూజలు చేశారు. ఆమె గెలిచాక సంబరాల కోసం బాణసంచా సిద్ధం చేసుకున్నారు. అంచనాలకు భిన్నంగా ట్రంప్ గెలవడంతో వారు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఓడినా కమలకు మద్దతిస్తామని, ఆమెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందంటున్నారు.
News November 6, 2024
బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి
AP: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్-ఛైర్మన్, ఎండీగా ఐఏఎస్ ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఆమ్రపాలి ఏపీకి వచ్చి రిపోర్ట్ చేశారు. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆమె విద్యాభ్యాసం విశాఖలో సాగింది. 2010లో ఆమె IASకు సెలెక్ట్ అయ్యారు.
News November 6, 2024
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు!
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రపంచ నలుమూలల క్రేజ్ ఉంటుంది. తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇది రుజువైంది. ఎన్నికల్లో ఒక ఓటరు తన ఓటును బాలయ్యకు వేశారు. ఏ అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేస్తారనే విభాగంలో ఇష్టమైన వ్యక్తి పేరు రాసి ఓటు వేసే అవకాశం ఉండటంతో సదరు వ్యక్తి ‘బాలయ్య’ అని రాశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.