News November 6, 2024
నా ప్రియ మిత్రుడు ట్రంప్‌కు శుభాకాంక్షలు: మోదీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గెలుపొంది 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘చరిత్రాత్మక విజయం పొందిన నా ప్రియ మిత్రుడికి శుభాకాంక్షలు. పరస్పర సహకారంతో భారత్-యూఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం. మన ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం విషెస్ తెలిపారు.
Similar News
News December 14, 2024
అల్లు అర్జున్‌ను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన ఆయన్ను ఫోన్‌లో సీఎం పరామర్శించారు. నిన్న అల్లు అరవింద్‌కు కూడా ఫోన్ చేసిన చంద్రబాబు ధైర్యంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే.
News December 14, 2024
ప్రాణాలు పోస్తున్న గుండెలు ఆగిపోతున్నాయి!
వైద్యులు గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లోని సీనియర్ డాక్టర్ ఆదిన్ అమీన్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం ఆందోళనకరం. ఈక్రమంలో దీనికి గల కారణాలను వైద్యులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సుదీర్ఘ పని గంటలు, పనిలో తీవ్రమైన ఒత్తిడి, వైద్యుల అనారోగ్య జీవనశైలి, సరైన నిద్రలేకపోవడం, నివారణకు రెగ్యులర్ చెకప్స్ లేకపోవడం’ అని చెప్తున్నారు.
News December 14, 2024
తొక్కిసలాటలో గాయపడిన బాలుడిని పరామర్శించిన బన్నీ వాసు
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన బాలుడిని నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చులు తామే భరిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు. అల్లు అర్జున్‌కు బన్నీ వాసు సన్నిహితుడనేది తెలిసిందే. నిన్న ఈ ఘటనపై నమోదైన కేసులోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యారు.