News November 7, 2024

నవంబర్ 7: చరిత్రలో ఈరోజు

image

* జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
* బాలల సంరక్షణ దినోత్సవం
* 1858: స్వాతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ జననం
* 1900: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎంపీ ఎన్‌జీ రంగా జననం
* 1954: ప్రముఖ నటుడు కమల్ హాసన్ పుట్టినరోజు(ఫొటోలో)
* 1971: డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ పుట్టినరోజు
* 1980: సింగర్ కార్తీక్ బర్త్‌డే
* 1981: హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్‌డే(ఫొటోలో)

Similar News

News January 14, 2025

క్రేజీ.. మహా కుంభమేళాలో ‘అఖండ-2’ షూట్

image

సంగీత దర్శకుడు తమన్ ‘అఖండ-2’ మూవీ గురించి అదిరిపోయే అప్టేడ్ ఇచ్చారు. యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈ మూవీ షూటింగ్ జరగనుందని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్ట్-1 సూపర్ హిట్ అవ్వగా పార్ట్-2పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన బాలయ్య ‘డాకు మహారాజ్’ పాజిటివ్ సొంతం చేసుకుంది.

News January 14, 2025

నేడు పసుపు బోర్డు ప్రారంభం

image

TG: కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పర్వదినాన పసుపు బోర్డును ఇవాళ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే జాతీయ బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 15 ఏళ్లుగా బోర్డు ఏర్పాటుకు రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

News January 14, 2025

రాహుల్ గాంధీ పోరాటం అందుకే: కేజ్రీవాల్

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చి తనను చాలా సార్లు తిట్టారని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై తానెప్పుడూ ఎలాంటి కామెంట్లు చేయలేదని తెలిపారు. రాహుల్ కాంగ్రెస్‌ను రక్షించడానికి పోరాడితే తాను మాత్రం దేశం కోసం ఫైట్ చేస్తానని చెప్పారు. మరోవైపు ఢిల్లీని పారిస్‌గా మారుస్తానని చెప్పిన కేజ్రీవాల్ కాలుష్యంతో ఎవరూ నగరంలో తిరగకుండా చేశారని రాహుల్ సెటైర్లు వేశారు.