News November 7, 2024
నవంబర్ 7: చరిత్రలో ఈరోజు
* జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
* బాలల సంరక్షణ దినోత్సవం
* 1858: స్వాతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ జననం
* 1900: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎంపీ ఎన్‌జీ రంగా జననం
* 1954: ప్రముఖ నటుడు కమల్ హాసన్ పుట్టినరోజు(ఫొటోలో)
* 1971: డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ పుట్టినరోజు
* 1980: సింగర్ కార్తీక్ బర్త్‌డే
* 1981: హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్‌డే(ఫొటోలో)
Similar News
News December 11, 2024
చైనాలో విజయ్ మూవీకి భారీ కలెక్షన్లు
విజయ్ సేతుపతి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘మహారాజ’ చైనా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ 12 రోజుల్లోనే దాదాపు 70 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో 2018లో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తర్వాత చైనాలో అత్యధిక కలెక్షన్లు చేసిన చిత్రంగా నిలిచింది. తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం.
News December 11, 2024
60 ఏళ్లలో వ్యాపారం స్టార్ట్ చేసి.. రూ.49వేల కోట్లకు!
ఒకప్పుడు సాధారణ ఉద్యోగ జీవితం గడిపిన లక్ష్మణ్ దాస్ మిట్టల్.. 60 ఏళ్ల వయసులో వ్యాపారాన్ని మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. 1990లో LIC నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత సోనాలికా ట్రాక్టర్స్ గ్రూప్‌ను స్థాపించారు. తర్వాత కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో కలిసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం 94 సంవత్సరాల వయస్సులో రూ.49,110 కోట్లతో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
News December 11, 2024
SMAT సెమీస్ చేరిన జట్లివే..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT) తుది అంకానికి చేరింది. బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ జట్లు సెమీస్‌లో అడుగుపెట్టాయి. ఎల్లుండి బరోడా-ముంబై, ఢిల్లీ-మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. వీటిలో గెలిచిన జట్లు 15న ఫైనల్‌లో ఆడనున్నాయి. ఏ జట్లు ఫైనల్ చేరుతాయని భావిస్తున్నారో కామెంట్ చేయండి.