News November 7, 2024
ఓటమిని ఒప్పుకోవాల్సిందే.. సంతృప్తిగానే ఉన్నా: కమలా హారిస్
అమెరికా ఎన్నికల ఫలితాలను కచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని కమలా హారిస్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తాను ఇప్పటివరకు సాధించినదాని పట్ల సంతృప్తిగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. ‘చాలా మంది దేశం చీకటిలోకి వెళ్తుందని భావిస్తున్నారు. కానీ అలా జరగదని నేను నమ్ముతున్నా. అమెరికా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ప్రజలందరికీ న్యాయం, గౌరవం, అవకాశాల కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 7, 2024
షారుఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ దుండగులు ఆయనకు కాల్ చేశారు. దీనిపై మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఖాన్‌ను బెదిరించింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడు రూ.50లక్షలు డిమాండ్ చేశాడని, ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఇటీవలే సల్మాన్‌ఖాన్‌కూ హత్య బెదిరింపు సందేశం వచ్చిన విషయం తెలిసిందే.
News November 7, 2024
మల్లారెడ్డికి ఈడీ నోటీసులు
TG: మాజీ మంత్రి, BRS MLA మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. పీజీ మెడికల్ సీట్లను అక్రమంగా బ్లాక్ చేశారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. గత ఏడాది జూన్‌లో మల్లారెడ్డికి చెందిన 12 మెడికల్ కాలేజీల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. పలు కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకుంది. వాటిని పరిశీలించిన అనంతరం నోటీసులిచ్చింది.
News November 7, 2024
యూనస్‌తో పాత లెక్కలు.. ట్రంప్ చుక్కలు చూపిస్తారా!
బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పెద్ద, నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్‌కు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తారని నిపుణుల అంచనా. 2016లో ట్రంప్ గెలిచాక బంగ్లా డెలిగేట్స్ ఆయన్ను కలిశారు. అప్పుడు ఆయన ప్రత్యేకంగా యూనస్‌ను గుర్తుచేశారు. ‘ఆ ఢాకా మైక్రో ఫైనాన్స్ వ్యక్తి ఎక్కడ? నేను ఓడిపోవాలని ఆయన విరాళం ఇచ్చినట్టు విన్నాను’ అని హసీనాకు షాకిచ్చారు. బంగ్లాలో హిందువులపై దాడి, ఇతర అంశాలపై ట్రంప్ సీరియస్‌గా ఉన్నారు.