News November 7, 2024
ఓటమిని ఒప్పుకోవాల్సిందే.. సంతృప్తిగానే ఉన్నా: కమలా హారిస్
అమెరికా ఎన్నికల ఫలితాలను కచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని కమలా హారిస్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తాను ఇప్పటివరకు సాధించినదాని పట్ల సంతృప్తిగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. ‘చాలా మంది దేశం చీకటిలోకి వెళ్తుందని భావిస్తున్నారు. కానీ అలా జరగదని నేను నమ్ముతున్నా. అమెరికా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ప్రజలందరికీ న్యాయం, గౌరవం, అవకాశాల కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 8, 2024
‘పుష్ప’ తరహాలో బంగాళదుంపల స్మగ్లింగ్
పశ్చిమ బెంగాల్‌లో బంగాళదుంపల ధరలు పెరగడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయొద్దని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. కాగా వ్యాపారులు ‘పుష్ప’ మూవీ తరహాలో వాటిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్నారు. బెంగాల్, ఝార్ఖండ్ సరిహద్దులో రెండ్రోజుల్లో పోలీసులు 20కి పైగా లారీలను సీజ్ చేశారు. వాహనాల పైభాగంలో పశువుల మేత, కింద బంగాళదుంపల బస్తాలను అమర్చి కొందరు చేస్తున్న స్మగ్లింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
News December 8, 2024
కాకినాడ పోర్టును నాశనం చేయొద్దు: ద్వారంపూడి
AP: రేషన్ బియ్యంతో తమ కుటుంబానికి సంబంధం లేదని, సిట్ విచారణకైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 6 నెలల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేదని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును నాశనం చేయొద్దని కోరారు. ప్రభుత్వ చర్యలతో ఎగుమతిదారులు భయపడుతున్నట్లు చెప్పారు. కేసులు ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసన్నారు.
News December 8, 2024
అలాగైతే క్షమాపణలు చెబుతాం: సీఎం రేవంత్
TG: దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా రూ.21వేల కోట్ల రుణమాఫీ జరిగిందా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఒకవేళ జరిగినట్లు నిరూపిస్తే తామంతా వచ్చి క్షమాపణలు చెబుతామని ప్రధాని మోదీ, కేసీఆర్‌లకు సవాల్ విసిరారు. దేశంలో BJP ఎక్కడైనా రుణమాఫీ చేసిందా అని ప్రశ్నించారు. ఫార్మాసిటీ కడతామంటే, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటే అడ్డుపడుతున్నాయని, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని సీఎం నిలదీశారు.