News November 7, 2024

ఏడాదిలో 4000 ATM మెషీన్‌లు క్లోజ్!

image

దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. చిరు వ్యాపారుల దగ్గర కూడా UPI పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. UPI, డిజిటల్ చెల్లింపుల కారణంగా భారతీయ బ్యాంకులు ATM మెషీన్‌లను మూసివేసే స్థితికి చేరుకున్నాయి. గత ఏడాదిలోనే 4000 ATM మెషీన్‌లు మూతపడినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ₹34.70 లక్షల కోట్ల నగదు చలామణి ఉంది. కాగా, దేశంలో లక్ష మందికి 15 ATMలు మాత్రమే ఉన్నాయి.

Similar News

News November 7, 2024

పోటీ చేయలేక పారిపోయిన జగన్ ముఠా: TDP

image

AP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ నేత <<14551662>>పేర్ని నాని ప్రకటించడంపై<<>> టీడీపీ వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి జగన్ రెడ్డి ముఠా పారిపోయిందని ట్వీట్ చేసింది. ఈవీఎంలపై నమ్మకం లేదని చెప్పి, బ్యాలెట్ ద్వారా జరుగుతున్నా పారిపోతున్నారని దుయ్యబట్టింది. ఎలాగూ ఓట్లు రావనే జగన్ రెడ్డి డిసైడ్ అయ్యి పోటీ చేయట్లేదని పేర్కొంది.

News November 7, 2024

HYDలో రెసిడెన్షియల్ సేల్స్ పెరుగుదల: స్క్వేర్ యార్డ్స్

image

2024 జులై-సెప్టెంబర్‌లో HYDలో రెసిడెన్షియల్ సేల్స్ 20%, లావాదేవీలు 7% పెరిగాయని స్క్వేర్ యార్డ్స్ సంస్థ తెలిపింది. గత ఏడాది జులై-సెప్టెంబర్‌(18,314)తో పోలిస్తే ఈ ఏడాది‌(19,527) ట్రాన్సక్షన్స్‌లో పెరుగుదల కనిపించిందని పేర్కొంది. మొత్తం రిజిస్టర్డ్ సేల్స్ విలువ ₹11,718కోట్లకు చేరిందని తెలిపింది. యావరేజ్ రిజిస్టర్డ్ హోమ్ సేల్స్ వాల్యూ ₹60లక్షలుగా ఉందని, వార్షిక వృద్ధి 13%గా నమోదయిందని వివరించింది.

News November 7, 2024

పదేళ్లలో తొలిసారి.. టాప్-20 నుంచి కోహ్లీ ఔట్

image

ICC టెస్ట్ బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 22వ స్థానానికి పడిపోయారు. ఇలా కోహ్లీ టాప్20 నుంచి పడిపోవడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆయన టెస్టుల్లో 2 సార్లు అగ్రస్థానానికి ఎగబాకారు. 2011లో 116, 2012లో 37, 2013లో 11, 2014 &15లో 15, 2016 &17లో 2, 2018 &19లో 1వ ర్యాంకు, 2020లో 2, 2021లో 9, 2022లో 15, 2023లో 9, ఈ ఏడాది 22వ స్థానానికి చేరుకున్నారు.