News November 7, 2024

స్వచ్ఛమైన గాలి దొరికే పట్టణాలివే

image

తీవ్రమైన వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడ AQI 300-350 మధ్య నమోదవుతోంది. ఇదిలా ఉంటే దేశంలోనే స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశంగా సిక్కిం రాజధాని గాంగ్‌టక్ నిలిచింది. అక్కడ AQI 29 మాత్రమే. ఆ తర్వాతి స్థానాల్లో ఐజ్వాల్-మిజోరాం(32), మంగళూరు(32), తిరునెల్వేలి(35), చామరాజనగర్(40), కోలార్(40), కలబురగి(41), ఉడుపి(45), త్రిస్సూర్(46), ట్యుటికోరిన్(46), కొల్లామ్(48) ఉన్నాయి.

Similar News

News November 7, 2024

INDvsSA: టీ20 ట్రోఫీ ఇదే

image

సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా రేపు రాత్రి 8.30గంటలకు మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల కెప్టెన్లు ట్రోఫీ ఆవిష్కరించారు. ఇద్దరూ కలిసి ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడి టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ ఈ టీ20 సిరీస్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

News November 7, 2024

త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం

image

AP: దేవాదయశాఖలోని పలు క్యాడర్లలో 500 పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. త్వరలోనే దేవాలయ ట్రస్టుబోర్డుల నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అన్నిరకాల ప్రసాదాల తయారీలో ఏ-గ్రేడ్ సామగ్రినే వాడాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల్లో వ్యాపార ధోరణి కాకుండా ఆధ్యాత్మిక చింతన ఉండాలని సూచించారు. నిత్యం ఓంకారం, దేవతామూర్తుల మంత్రోచ్చారణ వినిపించాలని పేర్కొన్నారు.

News November 7, 2024

నేను ఎవ్వరి కాళ్లు పట్టుకోను: పొంగులేటి

image

TG: తాను ఎవ్వరి కాళ్లు పట్టుకోనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒకే ఒక్కసారి పార్టీ కార్యక్రమంలో పెద్దవాడని భావించి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే కొందరు భుజాలు తడుముకుంటున్నారని దుయ్యబట్టారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకని, రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడుతుందని చెప్పారు. మరోవైపు కేటీఆర్ పాదయాత్ర చేస్తే స్వాగతిస్తానన్నారు.