News November 7, 2024
స్వచ్ఛమైన గాలి దొరికే పట్టణాలివే
తీవ్రమైన వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడ AQI 300-350 మధ్య నమోదవుతోంది. ఇదిలా ఉంటే దేశంలోనే స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశంగా సిక్కిం రాజధాని గాంగ్‌టక్ నిలిచింది. అక్కడ AQI 29 మాత్రమే. ఆ తర్వాతి స్థానాల్లో ఐజ్వాల్-మిజోరాం(32), మంగళూరు(32), తిరునెల్వేలి(35), చామరాజనగర్(40), కోలార్(40), కలబురగి(41), ఉడుపి(45), త్రిస్సూర్(46), ట్యుటికోరిన్(46), కొల్లామ్(48) ఉన్నాయి.
Similar News
News December 5, 2024
సౌతాఫ్రికా కెప్టెన్‌గా హెన్రిచ్ క్లాసెన్
పాకిస్థాన్‌తో T20 సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు హెన్రిచ్ క్లాసెన్ నాయకత్వం వహిస్తారు. మార్క్‌రమ్, జాన్సెన్, మహరాజ్, స్టబ్స్, రబడ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. జట్టు: క్లాసెన్, క్రూగర్, పీటర్, బార్ట్‌మన్, లిండే, రికెల్‌టన్, బ్రెట్జ్‌కీ, మఫాకా, షంషీ, ఫెర్రీరా, మిల్లర్, సైమ్‌లైన్, హెండ్రిక్స్, నోకియా, డస్సెన్. ఈ నెల 10 నుంచి ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది.
News December 5, 2024
కిమ్ జోంగ్ ఉన్‌లా చంద్రబాబు ధోరణి: VSR
AP: CM చంద్రబాబు ధోరణి ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌లా ఉందని YCP MP విజయసాయిరెడ్డి మండిపడ్డారు. CM నియంతృత్వ ధోరణితో YCP నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అణచివేత చర్యలు ఆయన పిరికితనానికి నిదర్శనం. ఆయన రాజకీయ ప్రతీకారానికి ఎలాంటి జస్టిఫికేషన్ లేదు. ప్రజలు జీవించే హక్కు కోల్పోయి అధికార పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News December 5, 2024
డిసెంబర్ 5: చరిత్రలో ఈ రోజు
* 1901: హాలీవుడ్ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
* 1905: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
* 1985: టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధవన్ జననం
* 1992: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ జననం
* 2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణం
* 2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం
* ప్రపంచ నేల దినోత్సవం .