News November 8, 2024
ట్రంప్ క్యాబినెట్‌లోకి మస్క్?
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఎలాన్ మస్క్‌కు క్యాబినెట్ పదవి కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అలాగే ఇండో-అమెరికన్లు వివేక్ రామస్వామి, కశ్యప్ పటేల్, బాబీ జిందాల్, నిక్కీ హేలీకి చోటు దక్కనున్నట్లు సమాచారం. తులసీ గబ్బార్డ్, మైక్ పాంపియో, బ్రూక్ రోలిన్స్, మార్కో రూబియో, రాబర్ట్ F.కెన్నడీ Jr, మైక్ వాల్ట్జ్, మిల్లర్‌లను ట్రంప్ తన క్యాబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
Similar News
News November 8, 2024
రేవంత్‌కు చిరంజీవి బర్త్ డే విషెస్
TG: సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజులు మీకు అద్భుతంగా ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ప్రజాసేవ చేయాలి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, బండి సంజయ్ కూడా ఎక్స్ వేదికగా విషెస్ చెప్పారు.
News November 8, 2024
VIRAL: యమునా నదిలో చిన్నారికి స్నానం
కాలుష్య కారకాలతో యమునా నది నిండిపోయింది. నదీ జలాలు విషపు నురుగుతో నిండిపోవడంతో ఛట్ పూజలు చేసేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ఓ తండ్రి తన బిడ్డతో నదిలో స్నానం చేస్తోన్న ఫొటోలు వైరలవుతున్నాయి. ఆ చిన్నారిని నురుగు కప్పేయడంతో అక్కడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో తెలుస్తోంది. ఇలాంటి నీళ్లలో స్నానం చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
News November 8, 2024
మరో బిజినెస్‌లోకి ముకేశ్ ఎంట్రీ
₹42 వేల కోట్లకు పైగా ఉన్న భారత స్నాక్ మార్కెట్‌ను ముకేశ్ అంబానీ టార్గెట్ చేశారు. ఇందులో ఎంట్రీకి తన సాఫ్ట్ డ్రింక్ ‘క్యాంపా’ తరహా స్ట్రాటజీ అమలు చేస్తున్నారట. దీని సేల్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లకు కోకాకోలా, పెప్సికో లాంటి బ్రాండ్ల మార్జిన్ల కంటే భారీగా ఇచ్చింది. ఇలా స్నాక్స్‌లో కంపెనీలు సూపర్ స్టాకిస్టులకు 3-5%, డిస్ట్రిబ్యూటర్లకు 6-15% మార్జిన్‌ను 8, 20% మార్జిన్+ ఆఫర్లను RIL ఇవ్వనుందట.