News November 8, 2024

ట్రంప్ క్యాబినెట్‌లోకి మస్క్?

image

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఎలాన్ మస్క్‌కు క్యాబినెట్‌ పదవి కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అలాగే ఇండో-అమెరికన్లు వివేక్ రామస్వామి, కశ్యప్ పటేల్, బాబీ జిందాల్‌‌, నిక్కీ హేలీకి చోటు దక్కనున్నట్లు సమాచారం. తులసీ గబ్బార్డ్‌, మైక్ పాంపియో, బ్రూక్ రోలిన్స్, మార్కో రూబియో, రాబర్ట్ F.కెన్నడీ Jr, మైక్ వాల్ట్జ్, మిల్లర్‌లను ట్రంప్ తన క్యాబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

Similar News

News December 8, 2024

ఏప్రిల్ నుంచి రాజమౌళి-మహేశ్ సినిమా షురూ?

image

రాజమౌళి- మహేశ్ బాబు కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం లొకేషన్లు, నటీనటుల ఎంపికలో దర్శకధీరుడు బిజీగా ఉన్నారు. ఏప్రిల్ మూడో వారం తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

News December 8, 2024

AUSvsIND: టీమ్ ఇండియా అమ్మాయిల లక్ష్యం 372

image

ఆస్ట్రేలియాలో భారత్, ఆసీస్ అమ్మాయిల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా బౌలర్లు తేలిపోయారు. జార్జియా వోల్(101), ఎలీస్ పెర్రీ(105) సెంచరీలు, లిచ్‌ఫీల్డ్(60), బెత్ మూనీ(56) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 50 ఓవర్లలో ఆసీస్ టీమ్ 371/8 స్కోర్ చేసింది. భారత బౌలర్లలో సైమా 3 వికెట్లు, మిన్ను 2, రేణుక, దీప్తి శర్మ, ప్రియా మిశ్రా తలో వికెట్ తీశారు.

News December 8, 2024

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

కార్తీక మాసం తర్వాత పెరుగుతాయనుకున్న చికెన్ రేట్లు కాస్త తగ్గాయి. కొన్ని చోట్ల యథాతథంగా ఉన్నాయి. HYDలో కేజీ చికెన్ రూ.180 నుంచి రూ.230 వరకు ఉంది. ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతిలోగా పెరగవచ్చని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు కోడిగుడ్ల ధర పెరుగుతోంది. ఒక కోడిగుడ్డుకు రిటెయిల్ ధర రూ.7గా ఉంది. హోల్‌సేల్‌లో రూ.6.50 పలుకుతోంది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంతుంది?