News November 8, 2024

KTRను అరెస్ట్ చేస్తారా?

image

TG: ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌కు సంబంధించిన కేసులో KTRను అరెస్ట్ చేస్తారనే ప్రచారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. రూ.55 కోట్ల చెల్లింపు <<14549490>>వ్యవహారంలో<<>> ఆయనపై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాయగా, ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అటు తనను అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చని, దేనికైనా రెడీ అంటూ KTR సైతం నిన్న ప్రెస్‌మీట్‌లో చెప్పడంతో ఈ అంశంలో ఏం జరుగుతుందా అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Similar News

News September 13, 2025

ఆమిర్ ఖాన్ తనయుడి సినిమాలో సాయిపల్లవి

image

సౌత్ హీరోయిన్ సాయిపల్లవి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తొలుత ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌ను అనుకున్నారు. తాజాగా దానిని ‘మేరే రహో’గా మార్చారు. ఈ మూవీని నవంబర్ 7న రిలీజ్ చేయాల్సి ఉండగా డిసెంబర్ 12కు వాయిదా వేశారు. ఇది సాయిపల్లవికి హిందీలో డెబ్యూ మూవీ కానుంది. ఆమె రణ్‌బీర్ ‘రామాయణ’ మూవీలోనూ నటిస్తున్నారు.

News September 13, 2025

SLBC: ఇకపై DBM పద్ధతిలో తవ్వకం

image

TG: ఈ ఏడాది FEBలో SLBC టన్నెల్ కూలి 8 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై టన్నెల్ బోరింగ్ మిషన్(TBM)తో తవ్వడం నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన పనిని డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ పద్ధతి(DBM)లోనే చేపట్టనుంది. జలయజ్ఞంలో భాగంగా 2005లో SLBC సొరంగ మార్గం నిర్మాణాన్ని ప్రారంభించారు. 30 నెలల్లో దీన్ని పూర్తిచేసేలా కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరగగా ఇప్పటికి 20 ఏళ్లవుతున్నా పూర్తికాలేదు.

News September 13, 2025

ఇంగ్లండ్‌.. హయ్యెస్ట్ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్!

image

ఫార్మాట్ ఏదైనా అత్యధిక స్కోర్లు నమోదు చేయడం ఇంగ్లండ్‌కు చాలా మామూలు విషయం అని చెప్పవచ్చు. వన్డేల్లో టాప్-3 హయ్యెస్ట్ స్కోర్లు (498/4 vs NED, 481/6 vs AUS, 444/3 vs PAK) ఆ జట్టు పేరిటే ఉంది. టెస్టుల్లో శ్రీలంక (952/6 vs IND) తర్వాత రెండో అత్యధిక స్కోర్ కూడా ENG పేరు మీదనే (903/7d vs AUS) నమోదైంది. తాజాగా అంతర్జాతీయ టీ20ల్లో ఫుల్ మెంబర్ టీమ్‌పై అత్యధిక స్కోర్ (304/2vsSA) చేసింది కూడా ఇంగ్లండే.