News November 10, 2024
శాంసన్ చరిత్ర సృష్టిస్తాడా?

భారత బ్యాటర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ఇవాళ SAతో మ్యాచులో శతకం బాదితే T20Iల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలవనున్నారు. ఇప్పటివరకు 34 టీ20లు ఆడిన శాంసన్ 701 పరుగులు చేశారు. ఓపెనర్‌గా అవతారమెత్తాక గేర్ మార్చి పరుగుల వరద పారిస్తున్నారు.
Similar News
News January 12, 2026
ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్థికశాఖ రూ.2,653 కోట్ల డీఏ, డీఆర్ ఎరియర్స్, కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసం రూ.1,110 కోట్లు, పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవులకు రూ.110 కోట్లు, ఈఏపీ, నాబార్డ్, సాస్కీ, CRIF పనులకు రూ.1,243 కోట్లు, నీరు-చెట్టు బిల్లులకు రూ.40 కోట్లు రిలీజ్ చేసింది. మొత్తంగా 5.7 లక్షల మందికి బిల్లులు, బకాయిలు చెల్లించింది.
News January 12, 2026
తొక్కిసలాట బాధ్యత టీవీకేది కాదన్న విజయ్!

కరూర్ <<17852847>>తొక్కిసలాట<<>>కు టీవీకేది బాధ్యత కాదని ఆ పార్టీ అధినేత విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో CBI <<18836427>>ఆయన్ను<<>> 6 గంటలు విచారించింది. విషాదం తీవ్రత పెరగకుండా తాను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారని సమాచారం. ‘విజయ్‌ను ప్రశ్నించడం ముగియలేదు. పండుగ నేపథ్యంలో వాయిదా వేయాలని ఆయన కోరారు. పొంగల్ తర్వాత ఆయన్ను మరోసారి పిలుస్తాం’ అని CBI వర్గాలు తెలిపాయి.
News January 12, 2026
మాజీ మంత్రి కన్నుమూత

AP: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కన్నుమూశారు. మెదడులో రక్తం గడ్డ కట్టే సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 4 సార్లు(1985, 89, 94, 99) టీడీపీ తరఫున పోటీ చేసి MLAగా గెలిచారు. ఎన్టీఆర్ హయాంలో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 2024 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.


