News November 10, 2024

శాంసన్ చరిత్ర సృష్టిస్తాడా?

image

భారత బ్యాటర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ఇవాళ SAతో మ్యాచులో శతకం బాదితే T20Iల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలవనున్నారు. ఇప్పటివరకు 34 టీ20లు ఆడిన శాంసన్ 701 పరుగులు చేశారు. ఓపెనర్‌గా అవతారమెత్తాక గేర్ మార్చి పరుగుల వరద పారిస్తున్నారు.

Similar News

News April 17, 2026

హైదరాబాద్‌లో మరో సైబర్ టవర్!

image

TG: హైదరాబాద్‌లో ఐటీ విప్లవానికి గుర్తుగా నిలిచిన సైబర్ టవర్స్ తరహాలో మరో అత్యాధునిక పరిపాలనా భవనం నిర్మితం కానుంది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కోసం ఐకానిక్ బిల్డింగ్‌ను 8 అంతస్తుల్లో నిర్మించనున్నారు. దీనికి రూ.200 కోట్లతో ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలును సీఎం పరిశీలనకు పంపారు. కైత్లాపూర్‌లోని ఐదెకరాల భూమిని అధికారులు ఎంపిక చేశారు.

News April 17, 2026

బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి?

image

నుదిటిపై కుంకుమను ధరించిన ప్రతీసారి ఉంగరపు వేలును ఉపయోగించడం మేలని, తద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే, ఈ వేలు సంపూర్ణ జల సూత్రాన్ని ఆకర్షిస్తుందట. తద్వారా బొట్టు పెట్టిన వారికి కూడా చాలా లాభాలుంటాయట. శరీరంలో శక్తి ప్రవాహాన్ని పెంచుకోవాలంటే ఈ నియమాన్ని పాటించాలని పండితులు చెబుతారు. ముఖ్యంగా స్త్రీలు కచ్చితంగా ఉంగరం వేలితోనే బొట్టు పెట్టుకోవాలట.

News April 17, 2026

దొరికిపోయిన ‘జననాయగన్’ లీక్ దొంగలు

image

విజయ్ సినిమా ‘జననాయగన్’ లీక్ కేసును పోలీసులు ఛేదించారు. ఓ ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ సినిమా స్టూడియో సెక్యూరిటీని దాటుకొని మరీ డిజిటల్ రీల్స్‌ను దొంగిలించినట్లు గుర్తించారు. వేరే ప్రాజెక్టులో పని చేస్తూ ఎడిటింగ్ రూమ్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నిందితుడు.. డేటాను దొంగిలించి మరో ఇద్దరికి చేరవేశాడు. దీంతో సినిమా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.