News November 11, 2024

సింహం సింగిల్‌గా రావడం అంటే ఇది: హోంమంత్రి అనిత

image

AP: జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారని, సింహం సింగిల్‌గా రావడం అంటే అదేనని హోంమంత్రి అనిత అన్నారు. ‘ఎమ్మెల్యేలను లాగేశావ్. బూతే సిగ్గుపడేలా బూతులు తిట్టించావ్. ప్రతిపక్ష నేతలను సస్పెండ్ చేయించావ్. అయినా చంద్రబాబు సాకులు చెప్పలేదు. ఒక్కడిగా వచ్చారు. అదీ ధైర్యం అంటే. ఎవరు సింహమో.. ఎవరు మేకవన్నెపులో వేరే చెప్పాలా? ఎనీ డౌట్స్?’ అని చంద్రబాబు పాత ఫొటోను ట్వీట్ చేశారు.

Similar News

News January 26, 2026

అబార్షన్ల మాఫియాపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చెప్పండి: కలెక్టర్

image

బాలికల పట్ల వివక్ష తగదని, జిల్లాలో బాలికల నిష్పత్తి తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తూ తగిన చర్యలు తీసుకోవడానికి కార్యక్రమాలు చేపడుతున్నామని హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. అందుకు సంబంధించిన ప్రచారపత్రాలను పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లోని హెల్త్ స్టాల్ వద్ద ఆవిష్కరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయడం నేరమని, అలాంటి వారి గురించి 63000 30940 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

News January 26, 2026

వేసవి ఉల్లి సాగుకు సూచనలు

image

వేసవి పంట కోసం ఉల్లిని సాగు చేయాలనుకుంటే ఈ నెలలోనే సిద్ధమవ్వాలి. పంట కొరకు ముందుగా నారును పెంచుకోవాలి. నారుమడి కోసం నేలను దున్ని 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 15 సెంటీ మీటర్ల ఎత్తు గల 10 మళ్లను తయారు చేసుకోవాలి. ఒక కిలో విత్తనానికి కాప్టాన్ లేదా థైరమ్‌ను 3గ్రా. లేదా ట్రైకోడెర్మావిరిడె 4 గ్రాములు పట్టించి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.

News January 26, 2026

భారతీయత ఉట్టిపడేలా ఉర్సులా జాకెట్

image

భారత సంప్రదాయం ఉట్టిపడేలా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ప్యాంటుసూట్స్‌లో కనిపించే ఆమె తాజాగా బనారసీ జాకెట్‌ను ధరించారు. గోల్డ్, మెరూన్ రంగులో ఉన్న ఈ దుస్తులు ఆకట్టుకుంటున్నాయి. 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఉర్సులా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తన జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవం అని ట్వీట్ చేశారు.