News November 11, 2024
సింహం సింగిల్‌గా రావడం అంటే ఇది: హోంమంత్రి అనిత
AP: జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారని, సింహం సింగిల్‌గా రావడం అంటే అదేనని హోంమంత్రి అనిత అన్నారు. ‘ఎమ్మెల్యేలను లాగేశావ్. బూతే సిగ్గుపడేలా బూతులు తిట్టించావ్. ప్రతిపక్ష నేతలను సస్పెండ్ చేయించావ్. అయినా చంద్రబాబు సాకులు చెప్పలేదు. ఒక్కడిగా వచ్చారు. అదీ ధైర్యం అంటే. ఎవరు సింహమో.. ఎవరు మేకవన్నెపులో వేరే చెప్పాలా? ఎనీ డౌట్స్?’ అని చంద్రబాబు పాత ఫొటోను ట్వీట్ చేశారు.
Similar News
News December 11, 2024
చలికాలంలో రోగనిరోధక శక్తికి ఇవి తినండి!
చలికాలంలో దగ్గు, జలుబు, ఫ్లూ రాకుండా రోగనిరోధక శక్తి అవసరం. కొన్ని ఆహారాలు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి ఇవి దూరమవుతాయి. విటమిన్ C ఉండే ఆరెంజ్, లెమన్, నిమ్మను ఆహారంలో భాగం చేయాలి. అల్లం, వెల్లుల్లి తరచూ తీసుకోవాలి. ఈ సీజన్‌లో లభించే చిలగడదుంపలు తింటే బీటా కెరోటిన్ శరీరంలోకి చేరి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే బచ్చలకూర, కాలే వంటి ఆకుకూరలు తింటే వాటిలోని విటమిన్ A,C,Kలతో రోగనిరోధక శక్తి బూస్ట్ అవుతుంది.
News December 11, 2024
శ్రీలీలకు పెళ్లి చేసే బాధ్యత నాదే: సీనియర్ హీరో
అన్‌స్టాపబుల్ షోలో శ్రీలీలపై ప్రేమను సీనియర్ హీరో బాలకృష్ణ మరోసారి చాటుకున్నారు. ఈ బ్యూటీకి పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత తనదేనని చెప్పారు. మంచి లక్షణాలు ఉన్న కుర్రాడిని వెతికిపెడతానని తెలిపారు. అంతకుముందు తాను పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని శ్రీలీల చెప్పిన సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించారు.
News December 11, 2024
‘ప్రజావాణి’ కొనసాగుతుంది: భట్టి విక్రమార్క
TG: ఎన్ని ఇబ్బందులొచ్చినా ‘ప్రజావాణి’ కొనసాగుతుందని dy.CM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమస్యలతో వస్తున్న వారందరికీ పరిష్కారం చూపుతున్నామన్నారు. దరఖాస్తులన్నీ పరిశీలిస్తున్నామని, ప్రతి ఒక్కరి బాధను వింటూ పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చి, వారికి జవాబుదారీతనంగా ఉండటమే తమ లక్ష్యమని వివరించారు. ‘మీ కోసం మేము ఉన్నాం’ అనే భావనను అధికారులు ప్రజలకు కల్పించాలని ఆదేశించారు.