News November 11, 2024

కొడుకు కాదు క్రూరుడు.. అమ్మను రోడ్డుపై వదిలేశాడు

image

AP: కని పెంచిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు. తీవ్ర వినికిడి లోపం ఉన్న ఆమెను మరో ఊరిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి(D) సోమందేపల్లిలో జరిగింది. తన బిడ్డ భోజనం తెచ్చేందుకు వెళ్లాడని ఆమె దీనంగా రోడ్డు పక్కన కూర్చుండిపోయింది. స్థానికులు ఆమెకు భోజనం, నీరు అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ఓ వృద్ధాశ్రమానికి తరలించారు.

Similar News

News April 17, 2026

మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర ఇదే

image

మహిళా రిజర్వేషన్ ప్రస్తావన రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలోనే (1946-49) వచ్చినా అది సాధ్యపడలేదు. 1996లో దేవెగౌడ ప్రభుత్వం 33% రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టగా గందరగోళం నెలకొంది. 1998-2003 మధ్య నాలుగుసార్లు సేమ్ సీన్ రిపీటైంది. 2010లో మళ్లీ UPA ప్రభుత్వం మొదట రాజ్యసభలో ఆమోదించినా ఆ తర్వాత జాప్యం వల్ల అమలులోకి రాలేదు. 2023లో ఈ బిల్లుకు ఆమోదం లభించగా దీనికి సవరణలు చేపట్టి కేంద్రం మరోసారి తీసుకొచ్చింది.

News April 17, 2026

ఏపీ SECగా అనిల్ చంద్ర.. గవర్నర్ ఆమోదం

image

AP: స్టేట్ ఎలక్షన్ కమిషనర్(SEC)గా రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. కాసేపట్లో జీవో వెలువడనుంది. అనిల్ చంద్ర గతంలో రాష్ట్ర సీఎస్‌గా పనిచేశారు. రిటైరైన తర్వాత ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత నెలాఖరుతో SECగా నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.

News April 17, 2026

సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్

image

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్ ఆలస్యం కానుంది. సా.4 గంటలకే ఓటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ కేంద్రమంత్రి అమిత్ షా 6PMకు ఆ బిల్లులపై ప్రసంగించనున్నారు. షా స్పీచ్ తర్వాత ఓటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.