News November 11, 2024
కొడుకు కాదు క్రూరుడు.. అమ్మను రోడ్డుపై వదిలేశాడు
AP: కని పెంచిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు. తీవ్ర వినికిడి లోపం ఉన్న ఆమెను మరో ఊరిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి(D) సోమందేపల్లిలో జరిగింది. తన బిడ్డ భోజనం తెచ్చేందుకు వెళ్లాడని ఆమె దీనంగా రోడ్డు పక్కన కూర్చుండిపోయింది. స్థానికులు ఆమెకు భోజనం, నీరు అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ఓ వృద్ధాశ్రమానికి తరలించారు.
Similar News
News December 13, 2024
బాబోయ్ చలి.. IMD ఆరెంజ్ అలర్ట్
TG: రాష్ట్రంలో చలి విషయంలో ఈ ఏడాది తొలి ఆరెంజ్ అలర్ట్‌ను హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD) జారీ చేసింది. ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, అందుకు తగ్గట్లుగా ప్రజలు సిద్ధం కావాలని సూచించింది. పలు జిల్లాల్లో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. ‘ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో బాగా ప్రభావం ఉండొచ్చు. ఈ నెల 15 వరకు హైదరాబాద్ మేఘావృతమై ఉంటుంది’ అని పేర్కొంది.
News December 13, 2024
అల్లు అర్జున్ అరెస్ట్ పబ్లిసిటీ స్టంట్: కేంద్ర మంత్రి
క్రియేటివ్ ఇండస్ట్రీ అంటే కాంగ్రెస్‌కు గౌరవం లేదని, ఈ విషయాన్ని అల్లు అర్జున్ అరెస్ట్ మరోసారి నిరూపించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనకు TG ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఆ నిందను పోగొట్టేందుకు ఇలా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోందని ఆరోపించారు. TG ప్రభుత్వం సినీ ప్రముఖులపై దాడులు చేసే బదులు బాధితులను ఆదుకోవాలని, భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా ఉన్న వారిని శిక్షించాలన్నారు.
News December 13, 2024
రేపటి నుంచే మూడో టెస్ట్.. షెడ్యూల్ ఇదే
భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి గబ్బాలో BGT మూడో టెస్ట్ జరగనుంది. 5.50am-7.50am ఫస్ట్ సెషన్, 8.30am-10.30am సెకండ్ సెషన్, 10.50am-12.50 pm థర్డ్ సెషన్ జరుగుతుంది. భారత జట్టులో హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్, అశ్విన్ ప్లేస్‌లో సుందర్ ఆడే ఛాన్సుంది. రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. అటు AUSలో బొలాండ్ స్థానంలో హెజిల్వుడ్ ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు .