News November 11, 2024
ప్లీజ్.. నన్నలా పిలవద్దు: కమల్ హాసన్
తనను ‘ఉలగనాయగన్’ వంటి స్టార్ టైటిల్స్‌తో పిలవొద్దని సినీపరిశ్రమ, మీడియా, అభిమానులకు కమల్ హాసన్ విజ్ఞప్తి చేశారు. ఆర్ట్ కంటే ఆర్టిస్ట్ గొప్ప కాదనే విషయాన్ని తాను నమ్ముతానని, తానెప్పుడూ గ్రౌండెడ్‌గా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ మరింత మెరుగవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కమల్ హాసన్/కమల్/KH అని మాత్రమే పిలవాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News December 26, 2024
ముఖ్యమంత్రి పదవినే వద్దనుకున్నా: సోనూ సూద్
తనకు రాజకీయాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని సినీ నటుడు సోనూ సూద్ తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు వంటి పదవుల ఆఫర్లు వచ్చాయని చెప్పారు. ‘కొందరు బడా నేతలు నన్ను సీఎంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. కానీ నేను దానికి అంగీకరించలేదు. నేను రాజకీయాల్లోకి వస్తే జవాబుదారీతనంతో ఉండాలి. కానీ అది నాకు నచ్చదు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా సేవ చేస్తున్నా. ఇకపై కూడా ఇలాగే ఉంటా’ అని ఆయన చెప్పుకొచ్చారు.
News December 26, 2024
ఇండియన్స్‌కు తక్కువ జీతం ఇవ్వొచ్చు : అమెరికా కంపెనీ ఫౌండర్
భారత ఉద్యోగులపై నియర్ కో ఫౌండర్ ఫ్రాంకో పెరేరా చేసిన వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని US వారికంటే భారతీయులకు తక్కువ వేతనం ఇవ్వడం తప్పుకాదని ఆయన linkedinలో పోస్ట్ చేశారు. ఇండియా, లాటిన్ అమెరికా, ఫిలిప్పీన్స్ గురించి ఇలా చెప్పారు. సమానమైన పని చేస్తున్నప్పటికీ ఇండియన్స్ ఇలా పనిదోపిడీకి గురవుతున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News December 26, 2024
కాంగ్రెస్‌ను తొలగించాలని కోరుతాం: ఆప్
INDIA కూటమి నుంచి కాంగ్రెస్‌ని తొలగించాలని మిత్రపక్షాల్ని కోరుతామని ఆప్ తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించడానికి BJPతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. BJP గెలుపు కోసం కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. కేజ్రీవాల్‌ను యాంటీ నేషనల్ అని విమర్శించిన అజయ్ మాకన్పై కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోతే కూటమి నుంచి ఆ పార్టీని తొలగించాలని కోరతామన్నారు.